తెలుగు వారికి బిగ్ బాస్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి కాబట్టి. ఇక ఆరో సీజన్ తాజాగా ప్రారంభమైంది. ఈ లెటెస్ట్ సీజన్‌కి నాగార్జున హోస్ట్‌గా చేస్తున్నారు. మొదటి సీజన్‌కి ఎన్టీఆర్, రెండో సీజన్‌కి నాని, మూడు, నాలుగు, ఐదు సీజన్లకి నాగార్జున హోస్ట్ చేశారు. ఈ లేటెస్ట్ ఆరో సీజన్ కూడా నాగార్జునే చేయడం విశేషం. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ సీజన్ 6 లేటెస్ట్ సీజన్ ప్రస్తుతం అదరగొడుతోంది. ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి మంచి రేటింగ్‌తో కేక పెట్టిస్తోంది.
గత సీజన్‌లతో పోల్చుకుంటే మంచి ఉత్కంఠభరితంగా సాగుతోంది. మొదటివారం బిగ్‌బాస్ ఎవరినీ ఎలిమినేట్ చేయలేదు. ఓటింగ్ సమయం లేనందున జోన్‌లో ఉన్న ఇనయా, అభినయ శ్రీలు సేఫ్ అయ్యారు. బిగ్‌బాస్ సీజన్ 6లో రెండవ కెప్టెన్ షిప్ కోసం పోటీ జరుగుతోంది. ఇక ఈ పోటీలో చంటి, ఆర్జే సూర్య, ఇనయ సుల్తానా, రాజ్‌లు ఉన్నారు. ఈ పోటీలో రాజ్ కెప్టెన్ గా నిలిచారు. ఇతర పోటీదారులతో పోల్చితే ఆయనకు అత్యధికంగా ఓట్లు రావడంతో కెప్టెన్ అయ్యాడు. మరో విశేషం ఏంటంటే ఆయన ఈవారం నామినేషన్‌లో ఉన్నారు. అందరితో పోల్చితే ఆయనకే ఓటింగ్ తక్కువగా ఉందని తెలుస్తోంది. రెండో నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్ విషయానికీ వస్తే రెండో వారం ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. రేవంత్, ఫైమా, ఆదిరెడ్డి, రోహిత్, మెరానా, గీతురాయల్, రాజ్‌శేఖర్, షానీ, అభినయశ్రీ. వీరిలో ఈ సారి ఎవరు ఇంటికి వెళ్లిపోతున్నారనే విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Advertisement
Advertisement
Also Read : Kamal Haasan : సింగిల్ టేక్‌లోనే.. 10 నిమిషాల డైలాగ్ 14 భాషల్లో..!
ఓటింగ్ పరంగా చూసినట్టయితే సింగర్ రేవంత్, ఫైమా ఇప్పటికే సేఫ్ అయినట్టు తెలుస్తోంది. వీరిద్దరికీ ఓటింగ్ శాతం ఎక్కువగానే ఉంటోంది. వీరి తరువాత ఆదిరెడ్డి, రోహిత్, మెరీనా కపుల్ సేఫ్ జోన్‌లోనే ఉన్నారట. మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్స్ అందరూ డేంజర్ జోన్‌లోనే ఉన్నట్టు సమాచారం. ఆదిరెడ్డి, గీతురాయల్, రాజ్‌శేఖర్, షానీ, అభినయశ్రీ ఓటింగ్ లో కాస్త వెనుకబడి ఉన్నారు. ఈ ఐదుగురిలో ఆదిరెడ్డి, గీతురాయల్ కాస్త ముందంజలో ఉండడంతో వారు సేవ్ అయినట్టు తెలుస్తోంది. మిగతా ముగ్గురు ప్రస్తుతం డేంజర్ జోన్‌లో ఉన్నారు. రాజ్ సేవ్ అయితే అవ్వోచ్చు కానీ, మిగిలి ఇద్దరిలో షానీ, అభినయ శ్రీ డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే షానీ, అభినయ శ్రీ ఇద్దరూ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని సోషల్ మీడియా చర్చించుకోవడం విశేషం.
Also Read : ఆస్కార్ రేసులో రామ్‌చరణ్, ఎన్టీఆర్.. ఖుషీ అవుతోన్న అభిమానులు..!