కేవలం తమిళ్ సినిమాల్లోనే కాకుండా తెలుగులో కూడా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో సూర్య. సూర్య తమిళ్లో నటించిన అనేక చిత్రాలు తెలుగులో డబ్ చేయబడి మంచి ప్రేక్షకాదరణ పొందాయి. 2008లో సూర్య నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అనే సినిమా రీ రిలీజ్ అయ్యి కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఒక డబ్బింగ్ సినిమా రీ రిలీజ్ అయితే ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తాయా అని ప్రతీ ఒక్కరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
అందుకు కారణం.. ఇప్పటికి కూడా ఈ చిత్రంలోని పాటలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి. అందుకే ఈ రేంజ్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. అప్పట్లో ఈ చిత్రం తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. కానీ, తెలుగు లో మాత్రం యావరేజ్ సక్సెస్ ని సొంతం చేసుకుంది. 2008 తెలుగులో వచ్చిన వసూళ్ల కంటే ఇప్పుడు రీ రిలీజ్ లో ఎక్కువగా వసూలు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు దాదాపుగా కోటి 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని సినీ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
Advertisement
ఇక ఇదే క్రేజ్ కొనసాగితే సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రం రీ రిలీజ్ హిస్టరీ లో అత్యధిక వసూలు రాబట్టిన టాప్ 5 సినిమాలలో ఒకటిగా నిలుస్తుంది అని అభిప్రాయాలు వెళ్లడవుతున్నాయి. రీ రిలీజ్ లో ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను చూసి నెటిజన్లు సైతం ఈ సినిమాలో అంత విషయం ఏముంది అంటూ వెతుకులాట మొదలు పెట్టేసారు. ఈ వెతుకులాటలో ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంసంగా మారింది.
ఈ సినిమాకి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాని తొలుత గౌతమ్ మీనన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రీమేక్ చేద్దామని అనుకున్నాడట. ఆ సమయంలోనే రామ్ చరణ్ చిరుత సినిమాని విడుదల చేశారు. ఈ అబ్బాయి చాలా బాగా నటించాడు. నా సినిమాకి ఇతను అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాడు అని అనుకోని డైరెక్టర్ గౌతమ్ మీనన్ రామ్ చరణ్ కి ఈ స్టోరీ ని వినిపించడం జరిగిందట. ఈ సినిమా స్టోరీ కూడా రామ్ చరణ్ కి బాగా నచ్చింది. కానీ, తండ్రి పాత్ర ఇంత చిన్న వయస్సులో తనకు సెట్ కాదని భయంతో ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసాడట రామ్ చరణ్ . ఇక గౌతమ్ మీనన్ వెంటనే సూర్యని కలిసి ఈ స్టోరీ వివరించడం, సూర్యకి కూడా ఈ కథ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అంత చకచకా జరిగిపోయాట.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
బిగ్ బాస్ షో నుంచి నాగార్జున అవుట్.. కొత్త హోస్ట్ ఎవరో అస్సలు ఊహించి ఉండరు..!
గద్దర్ కి ఆ పేరు అసలు ఎలా వచ్చిందో తెలుసా ?