Home » Chiranjeevi: ‘శివ శంకర్ వర ప్రసాద్’ పేరు చిరంజీవి గా మార్చిన వ్యక్తి ఎవరంటే

Chiranjeevi: ‘శివ శంకర్ వర ప్రసాద్’ పేరు చిరంజీవి గా మార్చిన వ్యక్తి ఎవరంటే

by Sravya
Ad

Chiranjeevi:  మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడు కూడా అదే జోరుతో సినిమాలు చేస్తున్నారు. కుర్ర హీరోలకి పోటీగా నిలుస్తున్నారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన మెగాస్టార్ 150 కి పైగా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

chiru-and-rajini

Advertisement

ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా సంపాదించుకున్నారు శివశంకర వరప్రసాద్ పేరు చిరంజీవి గా ఎలా మారింది..? అసలు ఈ పేరుని ఎవరు మార్చారు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. చిరంజీవి అసలు పేరు శివ శంకర్ వరప్రసాద్ అన్న విషయం అందరికీ తెలుసు. ఆ పేరుని చిరంజీవి కింద మార్చుకుని ఇండస్ట్రీలోకి వచ్చారు.

చిరంజీవి మొదటి సినిమా అయిన పునాదిరాళ్లు సినిమా చేస్తున్నప్పుడు స్క్రీన్ నేమ్ గా ఏం పేరు వేయాలి అని ఆలోచించినప్పుడు శివశంకర్ వరప్రసాద్ అని చిరంజీవి తన పేరు చెప్తే ఆ పేరు స్క్రీన్ నేమ్ గా పనిచేయదు అని దర్శకుడు చెప్పారు. దాంతో శివశంకర్ వరప్రసాద్ పేరుని మార్చుకోవాలని అనుకున్నారు. ఇటువంటి సమయంలో ఒకరోజు రాత్రి పడుకున్న తర్వాత హనుమాన్ టెంపుల్ లో ఒక అతను కనిపించి శివశంకర్ వరప్రసాద్ ని చూస్తూ చిరంజీవి ఇలా రా అని పిలిచారట. చిరంజీవి ఎవరిని పిలుస్తున్నావని అడిగితే నిన్నే ఇలా రా చిరంజీవి అని పిలిచారట దాంతో నెక్స్ట్ డే చిరంజీవి వాళ్ళ అమ్మగారికి చెప్పారు.

Advertisement

Also read:

అప్పుడు వాళ్ళ అమ్మగారు చిరంజీవి అంటే ఆంజనేయుడు మరొక పేరు. కాబట్టి ఆ పేరు ని పెట్టుకొని చెప్పడంతో చిరంజీవి పేరుని తన స్క్రీన్ మీద పెట్టుకున్నారు. తర్వాత చిరంజీవి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు ప్రస్తుతం ఇప్పుడు కూడా ఆయనని బీట్ చేసే హీరోలు ఇండస్ట్రీలో లేరు. ఇప్పటికి కూడా ఎంతో కష్టపడుతూ ముందుకు వెళ్తున్నారు చిరంజీవి. ఇన్నేళ్లు పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగించారు. ఈ వయసులో కూడా రిలాక్స్ అవ్వకుండా సినిమాలు చేస్తున్నారు అభిమానుల్ని సంతృప్తి పరుస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading