Rebelstar Prabhas Brother Name: తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ ఈశ్వర్ సినిమా ద్వారా వెండితెరపై అరంగేట్రం చేశారు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఆ తర్వాత వరస సినిమా అవకాశాలు దక్కించుకొని బాహుబలి వంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రంలో నటించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
Also Read: బాలయ్య వీర సింహారెడ్డి సినిమాలో అదే హైలెట్..చూస్తే కన్నీళ్లు ఆగవు..!
Advertisement
Advertisement
ఇది ఇలా ఉండగా, కృష్ణంరాజు అంత్యక్రియలు ప్రభాస్ సోదరుడు ప్రబోద్ చేతులమీదుగా జరిగిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ప్రబోధ్ అసలు ఏం చేస్తాడు, సినిమాల్లో ఎందుకు రాలేదు అంటూ చర్చలు జరుగుతున్నాయి. ప్రబోధ్ కి చిన్నప్పటినుండే వ్యాపారంపై మక్కువ. అందుకే సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కృష్ణంరాజు అప్పట్లో అడిగిన కూడా హీరోగా నటించేందుకు ఆసక్తి చూపించని ప్రబోద్ సినిమా నిర్మాణ కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకునేందుకు ఆసక్తి చూపించలేదట. ప్రభాస్ సన్నిహితులు యూవి క్రియేషన్స్ మొదలుపెట్టిన సమయంలో ప్రబోధ్ ని కూడా భాగస్వామిగా అనుకున్నారట. కానీ ఆయన మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం అస్సలు ఇష్టం లేదని క్లారిటీ ఇచ్చారట.అందుకే మీడియా ముందుకు కూడా ప్రబోధ్ ఎప్పుడు రాడు. ఆమధ్య తండ్రి చనిపోయిన సమయంలో కూడా ప్రబోధ్ గురించి ఎక్కువమందికి తెలియలేదు.
Also Read: రష్మిక కు కాంతార హీరో స్ట్రాంగ్ కౌంటర్….! అలా ఎందుకు చేసాడబ్బా …?
ఇన్నాళ్లకు ప్రభాస్ కి జాతీయ స్థాయిలో ఇమేజ్ వచ్చిన కారణంగా ఆయన అన్న ప్రబోధ్ గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. ప్రబోధ్ ముందు ముందు అయినా సినిమాల్లో లేదా మరి ఏదైనా ఎంటర్టైన్మెంట్ రంగంలో కనిపిస్తాడా అంటే కచ్చితంగా లేదని సన్నిహితులు అంటున్నారు. కానీ ప్రబోధ్ కి రాజకీయాలంటే ఆసక్తి ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. భవిష్యత్తులో కృష్ణంరాజుకి ఉన్న రాజకీయ నేపథ్యంతో ప్రబోద్ రాజకీయాలు చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.