Home » సంచలన శపథం చేసిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు…!

సంచలన శపథం చేసిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు…!

by Sravya
Ad

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతున్న ఎన్నికలకి టిడిపి బిజెపి జనసేన పొత్తులతో ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అభ్యర్థుల ప్రకటన జరుగుతుంది తాజాగా బిజెపి లోక్సభ బీజేపీ జాబితాన్ని ప్రకటించింది. నరసాపురం స్థానాన్ని భూపతి రాజు శ్రీనివాస్ వర్మకి కేటాయించారు నరసాపురం నుండి టికెట్ ఆశించిన రఘురామకృష్ణం రాజు కి చుక్క ఎదురైంది. తనకి టికెట్ రాకపోవడంతో దీని వెనుక జగన్ కుట్ర ఉందని రఘురామకృష్ణం రాజు తాజాగా సంచలన ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటాయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. తాజా పరిణామాల మీద ఎంతో మంది ఆందోళన వ్యక్తం చేస్తూ సందేశాలు పంపుతున్నారని ఫోన్లు చేస్తున్నారని రఘురామకృష్ణంరాజు అన్నారు.

Cm Jagan

అయితే తను ఎలాంటి ఆందోళనలో లేనని సంతోషంగా కూడా లేనని అన్నారు తనకి జగన్ షాక్ ఇవ్వబోతున్నారని టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని పిల్ల సజ్జల వెబ్సైట్లు మీడియా ఛానల్స్ ముందే చెప్పాయని అన్నారు. ఇంతకాలం జగన్ తనని డిస్ క్వాలిఫై చేయాలని ఒక దశలో చంపేయాలని కూడా ప్రయత్నాలు చేశారని అన్నారు. తనని అక్రమంగా అరెస్ట్ చేయించి జైల్లో పెట్టి చంపేందుకు జగన్ చేసిన కుట్రలు కూడా విఫలమయ్యాయని అన్నారు ప్రస్తుతం తనకి టికెట్ రాకుండా తాత్కాలికంగా జగన్ విజయం సాధించారని అపజయాన్ని అంగీకరిస్తున్నానని అన్నారు.

Advertisement

Advertisement

Also read:

ప్రస్తుతం మూడు అడుగులు వెనక్కి వేస్తున్నానని రఘురామా అన్నారు. రానున్న రోజుల్లో ప్రజల అండతో ప్రజాబలంతో ముందడుగు వేసి జగన్ ని పాతాళానికి తొక్కకపోతే నా పేరు రఘురామ కాదని శపథం చేశారు. బిజెపి నేత సోము వీర్రాజు ద్వారా తనకి టికెట్ రాకుండా జగన్ అడ్డుకోగలిగారని, అనుకున్నది మాత్రం జరగనివ్వనని అన్నారు పార్టీలో అన్యాయం చేసిన ప్రజల తనకి అన్యాయం చేయాలన్న విశ్వాసం ఉందని అన్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading