టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఒకప్పుడు సుమన్ డేట్స్ కోసం దర్శక, నిర్మాతలు పడిగాపులు కాసేవారు. ఇలాంటి సమయంలో ఒకరోజు అర్థరాత్రి సుమన్ ఇంటికి పోలీసులు వచ్చారు. సుమన్‌పై వదంతులు వచ్చాయి. 1985 మే నెలలో ఓ రోజు రాత్రి పోలీసులు సుమన్ ఇంటికి పోలీసులు వచ్చారు. మీ ఇంట్లో బాంబు ఉందని, మీ ఇల్లు సోదా చేయాలని చెప్పారు. కొద్ది సేపటికీ ఏమి దొరకలేదని చెప్పారు పోలీసులు. మీరు మాతోపాటు పోలీస్ స్టేషన్‌కి రావాలని అన్నారు. మీ మీద కొన్ని పోలీస్ కేసులున్నాయని చెప్పగా.. ఏం మాట్లాడుతున్నారని నేను వాదనకి దిగే లోపే మా అమ్మ నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి. పోలీసులకు సహకరించడం మన కర్తవ్యం అని చెప్పింది.
అమ్మ మాట విని పోలీసులతో పాటు కలిసి వెళ్లాను. విచారించి అరగంటలో పంపిస్తానని చెప్పిన పోలీసులు ఉదయం 5 గంటలకు మా అమ్మ అక్కడికి వచ్చారు. ఇక ఆ రోజంతా నన్ను పోలీస్ స్టేషన్‌లోనే కూర్చొబెట్టారు. అసలు ఎందుకు అరెస్ట్ చేశారనే దానికి పోలీసుల దగ్గర సమాధానం లేదు. పోలీసులు సైదాబాద్ కోర్టులో హాజరు పరిచారు. అమ్మాయిలను హింసించానని కేసు వేశారు. ఆ తరువాత మద్రాస్ సెంట్రల్ జైలుకి తరలించారు. టెర్రరిస్ట్‌లు, ఉన్మాదులు ఉండే సెల్లో వేశారు. నా జీవితంలో నేను మరిచిపోలేని కాలరాత్రులు ప్రారంభమైన ఆరోజు మే 20, 1985 అంతకు ముందు చాలా కాలం వరకు ఎవ్వరూ ఆసెట్‌లో లేరు. భయంకరమైన దుర్గందం మధ్య బొద్దింకలు, చీమలతో సహజీవనం చేయాల్సి వచ్చింది. తిండి లేదు. నిద్ర లేదు. ఏం జరిగిందో, ఎందుకు జరుగుతుందో తెలియని పరిస్థితి. అలాగే నిద్రలోకి జారుకున్నాను. తరువాత రోజు ఉదయం పేపర్‌లో సినిమా నటుడు సుమన్ అరెస్ట్ అని, హెడ్ లైన్‌లో రకరకాల కథనాలు వినిపించాయి. ఆ తరువాత విజిటింగ్ హవర్స్ లో మా అమ్మ మేనేజర్ వచ్చారు. మా అమ్మ నన్ను ఓదార్చాలో, నేను అమ్మను ఓదార్చాలో తెలియని పరిస్థితి ఇది.
ఇది కూడా చదవండి : ఉదయ్ కిరణ్ తో కలిసి నటించిన ఈ యాక్టర్స్ అందరు చనిపోయారని తెలుసా ? వారికి అదే శాపమా ?
అమ్మ నాకు దైర్యం చెప్పి వెళ్లింది. ఒకరోజు తమిళనాడులోని కరుణానిధి రాజకీయ ఖైదీగా మద్రాస్ సెంట్రల్ కి వచ్చారు. అక్కడ నేను ఒంటరిగా డార్క్ సెల్‌లో పడి ఉండడం చూసి చలించిపోయారు. అతని మీద ఉన్న ఆరోపణలు ఏంటి.? అతనికి చేస్తున్న ట్రీట్మెంట్ ఏమిటి..? అతను దోషి అని తెలియకుండా అతన్ని డార్క్ సెల్‌లో ఎందుకు వేశారు అని జైలులో సూపరింటెండెంట్ పై విరుచుకుపడ్డారు. అతన్ని సాధారణ సెల్ కి మార్చకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, జైలు సూపరింటెండెంట్‌ని హెచ్చరించారు. కరుణానిధికి గారికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను. జైలులో పడిన తొలి రోజుల్లోనే దుర్భర జీవితాన్ని అనుభవించిన నాకు ఆ తరువాత జైలు జీవితం అంత పెద్ద కష్టమేమి అనిపించలేదు. దానికి తోడు సినిమా గ్లామర్ ఉండడం వల్ల మిగతా ఖైదీలందరూ కూడా నన్ను ప్రత్యేకంగా చూసేవారు. వద్దన్నా కూడా కాళ్లు పట్టేవారు. బట్టలు ఉతికే వాళ్లు. అక్కడ రకరకాల ఖైదీలుండేవారు. అక్కడ చాలా మంది ఖైదీలుండేవారు.
ఐదు నెలలు గడిచిన తరువాత నా మీద పెట్టిన కేసుల గురించి అక్కడ తెలిసిన ఖైదీలు చెబుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. చార్జీషీట్ దాఖలు చేయకుండానే కేవలం ఎఫ్ఐఆర్ ఆధారంగా అనుమానంతో ఒక ఖైదీని సెంట్రల్ జైలులో పెట్టడమంటే దారుణం. కేవలం ఇద్దరూ హీరోయిన్లు మాత్రమే నా తరుపున మాట్లాడారు. వారిలో సుహాసిని ఒకరు కాగా, మరో హీరోయిన్ సుమలత సుమన్ మంచితనం గురించి చెప్పారు. భారతదేశంలోనే అతిపెద్ద న్యాయవాదిగా పేరుపొందినటువంటి రామ్‌జన్మలాని జీ తమిళనాడు న్యాయవాది జీ రామస్వామి, అతని అసిస్టెంట్ కుమారస్వామి సహాయంతో నాకు బెయిల్ లభించింది. నాన్ బెయిల్ కింద అరెస్ట్ అయిన వ్యక్తికి బెయిల్ రావడం ఇండియన్ జ్యుడిషియరీలో ఎప్పుడు జరుగలేదు. దాదాపు నెలల పాటు జైలులో ఉండి స్వేచ్ఛవాయివుని పీల్చుకున్నట్టు సుమన్ గుర్తు చేశాడు. 1985 అక్టొబర్ 17న నిర్బందం, స్వేచ్ఛకి గల తేడా ఎలా ఉంటుందో అప్పుడు తెలిసిపోయింది. నేను జైలు నుంచి విడుదల అయినప్పుడు నిర్మాతలు, దర్శకులు, అభిమానులు అందరూ ప్రశంసిస్తుంటే ఒక స్త్రీ మాత్రం కన్నీటి పర్వంతం అయింది. ఐదు నెలలుగా ఆమె నిద్రలేని రాత్రులు, శ్రమ ఫలితంగా నేను స్వేచ్ఛగా తిరుగుతుంటే ఆమె సంతోషాన్ని తట్టుకోలేక కన్నీటిని కార్చింది మా మాతృమూర్తి అని చెప్పారు సుమన్.
ఇది కూడా చదవండి : తారక్‌తో తొడ కొట్టించాలనుకున్నా.. కానీ కరణ్ వినాయక పూజ సరిగ్గా చేయలేదు..!