ఇదివరకు వృద్దులకు, కాస్త వయస్సు పై బడిన వారిలో ఎక్కువగా తెల్లజుట్టు సమస్య కనిపించేది. ఇటీవల రోజుల్లో చిన్న వయస్సు వారు తెల్లజుట్టు సమస్యకు గురవుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, హార్మోన్ ఛేంజ్, ఒత్తిడి పోషకాల కొరత, జీవన శైలిలో చోటు చేసుకుంటున్న మార్పులు, కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపులను వాడడం జుట్టు సంరక్షణ లేకపోవడం ఇలా రకరకాల కారణాల వల్ల చిన్న వయసులోనే నల్ల జుట్టు తెల్లగా మారిపోతుంది. దీంతో ఏం చేయాలో తెలియక తెల్లజుట్టును కవర్ చేసుకునేందుకు కలర్స్ పై ఆధారపడుతున్నారు. తెల్ల జుట్టును కవర్ చేసేందుకు కలర్ అవసరం లేదు. ఇప్పుడు చెప్పబోయే హెయిర్ ఫ్యాక్‌ని వేసుకుంటే న్యాచురల్ వైట్ హెయిర్ ను బ్లాక్‌గా మార్చుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ ఫ్యాక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇలా కూడా చదవండి : మీరు ఇష్టపడేవారు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి..?
Advertisement
Advertisement
ముందు స్టవ్ చేసి మందపాటి గిన్నెను పెట్టుకుని గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇక వాటర్ వేడి అయిన తరువాత రెండు టేబుల్ స్పూన్ల మెంతులపొడి ఒక స్పూన్ లవంగాల పొడి, ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడి వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్లో ఫ్లేమ్ పై 5 నుంచి 8 నిమిషాల పాటు వాటర్ ని మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ తరువాత వాటర్‌ని ఫిల్టర్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇకపై తెల్ల జట్టును కవర్ చేసుకునేందుకు కలర్స్ పై ఆధారపడుతున్నారు. అయితే ఇకపై తెల్లజుట్టును కవర్ చేసేందుకు కలర్ అవసరం లేదు. ఇప్పుడు చెప్పబోయే హెయిర్ ఫ్యాక్ ని వేసుకుంటే సాధారణంగా వైట్ హెయిర్‌ని బ్లాక్ గా మార్చుకోవచ్చు.
ఇవి కూడా చదవండి : భార్య పొరపాటున కూడా భర్తను ఈ మాటలు అస్సలు అనకూడదు..!
ఒక బౌల్ తీసుకొని అందులో ఐదారు స్పూన్లు హెన్నా పొడి, ఒక స్పూన్ పుల్లటి పెరుగు, ముందుగా తయారు చేసుకున్న వాటర్‌ని వేసుకొని మిక్స్ చేసుకుంటే ఫ్యాక్ సిద్ధమైనట్టే లెక్క. ఇక ఈ ఫ్యాక్‌ని జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకు అప్లై చేసుకుని గంట అనంతరం మైల్డ్ షాంపుతో తలస్నానం చేయాలి. అనంతరం జుట్టును తడి లేకుండా ఆరబెట్టుకుని రెగ్యులర్ ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. మరుసటి రోజు మళ్లీ హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇక వారంలో ఒక్కోసారి ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఇక ఇంకెందుకు ఆలస్యం తెల్ల జుట్టు ఉన్న వారు ఈ చిట్కాను పాటించి నల్ల జుట్టుగా మార్చుకోండి.
ఇవి కూడా చదవండి : Chanakya Niti : ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే ఆర్థిక సమస్యలు ప్రారంభమైనట్టే..!