Home » ఎరుపు, తెలుపు రంగు జామ పండ్ల‌లో ఏది మంచిది.. నిపుణులు ఏమ‌న్నారంటే..?

ఎరుపు, తెలుపు రంగు జామ పండ్ల‌లో ఏది మంచిది.. నిపుణులు ఏమ‌న్నారంటే..?

by Anji
Ad

జామ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటానికి డైట్ లో ఈ పండ్లను తినడం తప్పనిసరిగా తీసుకోవ‌డం బెట‌ర్‌. ఒక్కొక్క పండు ఒక్కో రకమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. కొన్ని పండ్లు సీజనల్ గా దొరుకుతాయి. మరికొన్ని సీజన్ తో సంబంధం లేకుండా ల‌భిస్తాయి. వీటిలో జామపండు ముందు వరుసలో ఉంటుంది. జామకాయ తెలియనివారు ఉండరు. ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా పెంచుకునే చెట్టు ఇది. ఇది చిన్న పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఇష్టం. ఆకుపచ్చరంగులో ఉండి అనేక రకాలు ఉంటాయి. జామకాయ లోపల ఉండే గుజ్జు కొన్నింటిలో గులాబి రంగులో ఉంటుంది. మరికొన్నింటిలో తెలుపు రంగులో ఉంటుంది.

Advertisement

చాలామంది జామకాయ తినేటప్పుడు కొన్ని సందేహాలు వచ్చి ఉంటాయి. తెలుపు రంగు ఉన్న జామకాయ మంచిదా లేక గులాబిరంగు ఉన్న జామ మంచిదా అని సందేహాలు వస్తుంటాయి. అయితే నిపుణులు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సాధారణంగా జామకాయ తింటే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని నివారిస్తుంది. మనం తిన్న ఆహారం సులువుగా జీర్ణం అయ్యేలా జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో జామకాయ బాగా సహాయపడుతుంది.

Advertisement

Also Read :  ప్ర‌తి రోజు ఈ గింజ‌ల‌ను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు..!

అలాగే జామ పండ్లలో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎరుపురంగు జామలో నీటి శాతం ఎక్కువగా, చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. తక్కువ పిండి పదార్థాలు, విటమిన్ సి ఉంటాయి. తెల్ల జామలో ఎక్కువ చక్కెర, స్టార్చ్, విటమిన్ సి, ఎక్కువగా గింజలు ఉంటాయి. తెల్ల గుజ్జు జామ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కానీ ఎరుపురంగు జామకాయలో ఇంకా ఎక్కువ శాతం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎరుపు జామ లో సహజంగా లభించే కెరోటినాయిడ్ పదార్థం ఉంటుంది. పింక్ జామపండ్లను సూపర్ ఫ్రూట్స్ అని పిలుస్తారు. వీటిలో విటమిన్ ఏ, సి ల ఒమేగా త్రీ ఒమేగా 6, అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. చక్కెర వ్యాధి ఉన్నవారికి జామకాయ బాగా ఉపయోగపడుతుంది.

Also Read :  ఫ్రిజ్‌లో పండ్లు, కూర‌గాయ‌ల‌ను పెడుతున్నారా..? అయితే ఈ విష‌యాలు త‌ప్ప‌కుండా తెలుసుకోండి..!

Visitors Are Also Reading