Home » పెరుగు, మ‌జ్జిగ రెండింటిలో ఏది బెస్ట్.. వాటి ప్ర‌యోజ‌నాలు తెలిస్తే వ‌ద‌ల‌రు..!

పెరుగు, మ‌జ్జిగ రెండింటిలో ఏది బెస్ట్.. వాటి ప్ర‌యోజ‌నాలు తెలిస్తే వ‌ద‌ల‌రు..!

by Anji
Ad

చాలా మంది ప్ర‌తి రోజూ పెరుగు, మ‌జ్జిగ రెండింటిలో ఏదో ఒక‌టి త‌ప్ప‌కుండా తింటుంటారు. ఈ రెండింటిలో మాత్రం ఏది మంచిది అంటే చాలా మంది త‌డ‌బ‌డుతుంటారు. కొంద‌రు పెరుగు మంచిద‌ని చెబుతుంటే.. మ‌రికొంద‌రూ మ‌జ్జిగ మంచిద‌ని చెబుతుంటారు. ఈ రెండింటిలో ఏది మంచిదో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.


పెరుగు కంటే మ‌జ్జిగతో ఎక్కువ లాభాలు పొంద‌వ‌చ్చు. ఒక గ్లాస్ మ‌జ్జిగ తాగ‌డంతో అది మ‌న శ‌రీరాన్ని వేడి నుంచి రక్షించి రిలీఫ్‌ని అందిస్తుంది. అదేవిధంగా ఎక్కువ మ‌సాలాలు ఉండే ఫుడ్ తిన్న త‌రువాత మ‌జ్జిగ తాగితే ఆరోగ్యానికి ఎంతో ప్ర‌యోజ‌న‌క‌రం చేకూరుతుంది. అదేవిధంగా క‌డుపులో బాధ‌, నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌ను మ‌జ్జిగ దూరం చేస్తుంది. పెరుగులో ప్రోటీన్లు అధికశాతంలో ఉంటాయి. శ‌రీరంలో ప్రోటీన్ లోపం ఉన్న వారు పెరుగు తీసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా పెరుగు, మ‌జ్జిగ రెండింటిలో కూడా విట‌మిన్లు, ఖ‌నిజాలు, ప్రోటీన్లు ఉంటాయి. అయినా వీటి మ‌ధ్య మాత్రం వ్య‌త్యాసం ఉంటుంది. పెరుగు, మ‌జ్జిగ‌ను వేర్వేరు ప‌రిస్థితుల్లో తీసుకోవ‌డం వ‌ల్ల వేర్వేరు ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Advertisement

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  ఈ 3 లక్షణాలు ఉన్న పురుషులను..మహిళలు చాలా ఇష్టపడతారట.. ఇందులో 2వది ఇంపార్టెంట్..!!


పెరుగు తిన‌డం ద్వారా ప‌లు వ్యాధుల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. పెరుగు కూడా శ‌రీరానికి చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. ముఖ్యంగా అధిక‌ బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు మ‌జ్జిగ‌ను తీసుకోవ‌డం మేలు. మ‌జ్జిగ‌లో కాల్షియంతో పాటు ఎన్నో విట‌మిన్లు ల‌భిస్తాయి. అవి బ‌రువు తగ్గేందుకు ఉప‌యోగ‌ప‌డుతాయి. కాబట్టి పెరుగు, మ‌జ్జిగ రెండు తీసుకోవ‌చ్చు. ఎవ‌రికి అనుగుణంగా వారు తీసుకోవ‌డం బెట‌ర్.

ఇది కూడా చ‌ద‌వండి :  మీరు గుడ్లు ఉడ‌క‌బెట్టేట‌ప్పుడు ప‌గిలిపోతున్నాయా..? అయితే ఈ టిప్స్ పాటించండి

Visitors Are Also Reading