Home » మీరు గుడ్లు ఉడ‌క‌బెట్టేట‌ప్పుడు ప‌గిలిపోతున్నాయా..? అయితే ఈ టిప్స్ పాటించండి

మీరు గుడ్లు ఉడ‌క‌బెట్టేట‌ప్పుడు ప‌గిలిపోతున్నాయా..? అయితే ఈ టిప్స్ పాటించండి

by Anji
Ad

సాధార‌ణంగా మ‌న శ‌రీరానికి గుడ్లు ఎంత మేలు చేస్తాయో చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. చాలా ర‌కాల పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. అందుకోసమే డాక్టర్లు రోజు ఒక గుడ్డు తినాల‌ని సూచిస్తుంటారు. చిన్న‌పిల్ల‌ల‌కు ఆహారంలో గుడ్లు క‌చ్చితంగా ఉండాలి. వీటిని తిన‌డం వ‌ల్ల పిల్ల‌లు రోజు అంతా యాక్టివ్ గా ఉంటారు. మెద‌డు కూడా బాగా ప‌ని చేస్తుంది. దీని ఫ‌లితంగా వారు చ‌దువులో మ‌రింత చురుకుగా మారుతారు. చాలా మంది గుడ్ల‌ను ఉడ‌క‌బెట్ట‌డం, ఆమ్లెట్లు ఇలా చాలా రూపాల్లో తీసుకుంటారు. చాలా ఇళ్ల‌ల్లో ప్ర‌జ‌లు అల్పాహారంలో గుడ్లు తిన‌డానికి ఇష్ట‌ప‌డుతుంటారు. వారు ఉడ‌క‌బెట్టిన గుడ్ల‌ను మాత్ర‌మే తీసుకోవాలి. ఆమ్లెట్లు తీసుకుంటే అందులో ఉండే నూనె కొవ్వుగా మారుతుంది. చాలా మంది గుడ్లు ఉడ‌క‌బెట్టే స‌మ‌యంలో తెలిసో తెలియ‌క కొన్ని చిన్న చిన్న పొర‌పాట్లు చేస్తుంటారు. దీంతో అవి ప‌గిలిపోతుంటాయి. అయితే కొన్ని ట్రిక్స్ పాటిస్తే గుడ్లు ప‌గ‌ల‌కుండా చేయ‌వ‌చ్చు. అవి ఏంటో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.


రెండు లేదా మూడు గుడ్లు ఉడ‌క‌బెట్టాల‌నుకుంటున్న‌ప్పుడు ఇందుకోసం పెద్ద ప‌రిమాణ‌పు పాత్ర‌ను ఎంచుకోండి. ఇలా చేయ‌డం ద్వారా గుడ్లు ఉడ‌క‌బెట్టేట‌ట‌ప్పుడు ఒక‌దానికొక‌టి ఢీ కొన‌వు. దీని ఫ‌లితంగా అవి ప‌గిలిపోకుండా ఉంటాయి. గ్యాస్ ఆదా చేయ‌డం కోసం లేదా గుడ్ల‌ను త్వ‌ర‌గా ఉడ‌క‌బెట్ట‌డానికి చిన్న పరిమాణ‌పు పాత్ర‌ల‌ను ఉప‌యోగిస్తారు. ఇలా చేయ‌డం వ‌ల్ల గుడ్లు త్వ‌ర‌గా ప‌గిలిపోతుంటాయి. గుడ్లు ఉడ‌క‌బెట్టె స‌మ‌యంలో నీటిలో తొలుత ఉప్పు వేయాల‌ని చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు. వాస్త‌వానికి ఉప్పును జోడిస్తే వంట‌కాలు చాలా రుచిక‌రంగా ఉంటాయి. ఇక ఉప్పు నీటిలో గుడ్ల‌ను ఉడ‌క‌బెట్ట‌డం వ‌ల్ల వాటి పెంకుల‌ను తొల‌గించ‌డం కూడా చాలా సుల‌భం అవుతుంది.

Advertisement

Advertisement

ఇది కూడా చ‌దవండి :  ముప్పై ఏళ్ల‌కే ముడ‌తలా.. ఫోన్‌తో ఎక్కువ‌సేపు గ‌డిపితే ఇక అంతే..!


చాలా సార్లు ప్ర‌జ‌లు గుడ్ల‌ను ఉడ‌క‌బెట్టిన త‌రువాత వాటి తొక్క‌ల‌ను సరిగ్గా తీయ‌లేరు. దీనిని నివారించ‌డానికి గుడ్లు ఉడ‌క‌బెట్టే నీటిలో కాసింత ఉప్పును క‌ల‌పాలి. కొంత మంది గుడ్ల‌ను ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అయితే వాటిని నేరుగా ఉడ‌క‌బెడితే ప‌గిలిపోయే అవ‌కాశం ఉంది. ఫ్రిజ్ నుంచి గుడ్ల‌ను బ‌య‌టికి తీసి త‌రువాత 10 లేదా 15 నిమిషాలు అదేవిధంగా వ‌దిలివేయాలి. ఇలా చేయ‌డం ద్వారా వాటి ఉష్ణోగ్ర‌త సాధార‌ణ స్థితికి చేరుకుంటుంది. ఎక్కువ సేపు మంట‌పై పెద్ద మంట‌పై గుడ్ల‌ను ఉడ‌క‌బెట్ట‌కూడ‌దు. ఎల్ల‌ప్పుడూ మీడియం మంటపైనే గుడ్ల‌ను ఉడ‌క‌బెట్టాలి. అవి ప‌గ‌లకుండా బాగా ఉడ‌క‌డానికి అవ‌కాశం ఉంటుంది.

ఇది కూడా చ‌దవండి :  వ‌ర్షాకాలంలో మీ చిన్నారుల‌ను దోమ కాటు నుంచి ర‌క్షించ‌డానికి చిట్కాలు ఇవే..!

Visitors Are Also Reading