Home » ఆ హీరోయిన్లకు హీరోలు దొరక్క సినిమాలు చేయడం లేదట.. డీజే టిల్లు బ్యూటీ ఏమంటుందంటే..!!

ఆ హీరోయిన్లకు హీరోలు దొరక్క సినిమాలు చేయడం లేదట.. డీజే టిల్లు బ్యూటీ ఏమంటుందంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు సక్సెస్ వస్తుందో తెలియదు. ఎప్పుడు ఫ్లాప్ వస్తుందో తెలియదు. ఒకసారి సక్సెస్ వచ్చిందంటే కొంతమంది వెనక్కి చూడకుండా దూసుకుపోతున్నారు. మరికొంతమంది అలా దూసుకుపోయి ఒక్కసారి బోల్తా పడుతున్నారు. అయితే కొంతమంది నటీనటుల సక్సెస్ వచ్చిన తర్వాత ఆచితూచి అడుగులు వేయాలని ఆలోచనలో పడ్డారు. అయితే ఈ హీరోయిన్లు సక్సెస్ సాధించి మంచి పేరు సంపాదించి మంచి సినిమా చేద్దాం అంటే పెద్ద హీరో దొరకడం లేదట.. వారెవరో చూద్దాం..! చలో గీత గోవిందం సేమ్ రష్మిక మందన్న ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా

Advertisement

Advertisement

 

 

మారిపోయింది. అలాగే అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి మంచి పేరు సంపాదించుకున్న శాలిని పాండే, ఆ తర్వాత ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి తో మెహబూబా సినిమాలో నటించి మెప్పించింది బెంగళూరు భామ నేహా శెట్టి. ఈ బ్యూటీ కూడా ఇప్పుడు హీరోల వెతికే పనిలో పడిందట. ఇటీవల కాలంలో డీజే టిల్లుతో విజయాన్ని అందుకున్న రాధిక అక్క పాత్రతో చాలా పాపులర్ అయింది నేహా శెట్టి. అయితే

మెహబూబా మూవీ తర్వాత చిన్న హీరోల సినిమాలు తిరస్కరిస్తూ వచ్చిన నేహా.. అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి హీరోలతో సినిమాలు చేయడం కోసం ఎదురు చూసింది. దాన్ని పక్కన పెడితే చాలా గ్యాప్ తర్వాత హీరో జొన్నలగడ్డ సిద్ధూతో మూవీ చేసి విజయం సాధించింది. అయితే ఈ హిట్టుతో నేహా శెట్టి పెద్ద పెద్ద సినిమాలు ఆఫర్ల కోసం ప్రయత్నం చేస్తుందని అంతా అనుకున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి హీరోలు ఇప్పటికే టాప్ హీరోయిన్లను వారి యొక్క సినిమాలకు ఫైనల్ చేసుకున్నారు.

 

 

Visitors Are Also Reading