Telugu News » రెండు శ్రావణ మాసాలలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు జరుపుకోవాలంటే..?

రెండు శ్రావణ మాసాలలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు జరుపుకోవాలంటే..?

by Mounika

 ఈ జులై 17 రాత్రి 12 గంటల ఒక్క నిమిషంతో అమావాస్య  పూర్తి కావడంతో ఆషాడం మాసం నుండి శ్రావణమాసంలోకి అడుగుపెట్టాము. అయితే ఈ సంవత్సరం శ్రావణ మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. ఒకటి కాదు ఏకంగా రెండు నెలల పాటు శ్రావణమాసం కొనసాగుతుంది.  వీటినే అధిక శ్రావణమాసం మరియు నిజ శ్రావణమాసం అని అంటారు.  ఇలా రెండు శ్రావణమాసాలు రావడంతో హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరిలోని ఒక కొత్త సమస్య ఎదురైంది. ఇంతకీ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది.? ఈ రెండు మాసాలలో ఏ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేయాలి అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

Varalaxmi vratham అయితే ముందుగా అధిక మాసం అంటే ఏమిటి..?  అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ అధికమాసం అనేది ప్రతి సంవత్సరం  రెండున్నర సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. అయితే ఇది శ్రావణ మాసంలోనే ప్రతిసారి వస్తుందా..? అనే సందేహం మీకు రావచ్చు. అధిక మాసం కేవలం శ్రావణమాసంలోనే రాదు. తెలుగు మాసాలు అయినా చైత్రమాసం నుండి ఆశ్రయిజ మాసం మధ్యలో ఎప్పుడైనా సరే ఈ అధికమాసం రావచ్చు.

 అయితే మనకి ఈసారి ఈ 2023వ సంవత్సరంలో శ్రావణమాసానికి ముందు ఈ అధిక మాసం వచ్చింది.  కాబట్టి దీనిని అధిక శ్రావణమాసం అని అంటారు. మన శాస్త్రాల ప్రకారం ప్రతి మాసంలో సూర్యుడు సంక్రమణం జరుగుతుంది. అయితే  అధికమాసంలో మాత్రం సూర్యుడు సంక్రమణం అనేది జరగదు. అంటే ఒక్కో రాశిలో ఒక నెల పాటు తిరగాల్సిన సూర్యుడు, రెండు నెలల పాటు ఓకే రాశిలోనే ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఇలాంటి సమయాన్ని  అధికమాసమని అంటారు.

 

పౌర్ణమి రోజుల చంద్రుడు శ్రవణం నక్షత్రంలో ప్రవేశిస్తాడు. కాబట్టి తెలుగు సంవత్సరంలో ఐదో నెలను శ్రావణ మాసం అంటారు. ప్రతి ఏటా జులై, ఆగస్టు నెలల్లో వచ్చే ఈ మాసం  తెలుగు పంచాంగం ప్రకారం జూలై 18వ తేదీ నుంచి  మొదలై సెప్టెంబరు 15 వరకూ ఉంటుంది. జూలై 18 నుండి ఆగస్టు 18 వరకు అధిక శ్రావణమాసం ఉంది. ఇకపోతే  ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 15 వరకు నిజ శ్రావణమాసం గా నిర్ణయించబడింది.  ఈ నిజ శ్రావణం మాసం మాత్రమే లక్ష్మీఆరాధన, మంగళ గౌరీ వ్రతాలకు అనువైన కాలముగా పండితులు వెల్లడిస్తున్నారు. కాబట్టి ఆగస్టు 25న వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతానికి అనువైన రోజుగా పండితులు సూచిస్తున్నారు.

Visitors Are Also Reading