Home » మెగాస్టార్ ఆచార్య ర‌న్ టైమ్ ఎంతంటే..?

మెగాస్టార్ ఆచార్య ర‌న్ టైమ్ ఎంతంటే..?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ కుర్రహీరోలు కూడా చేయలేనంత స్పీడుగా సినిమాలు చేస్తున్నాడు. ఈయన ఇది వరకు ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేసేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు ఒకటి పూర్తి అవ్వకుండానే మరొకటి చేస్తూ ఫుల్ స్పీడ్ గా ఉన్నాడు. ప్రజెంట్ చిరంజీవి-రామ్ చరణ్ కలిసి టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించిన సినిమా ఆచార్య.
ఈ సినిమాను రిలీజ్ కు రెడీ గా ఉంచాడు.

Advertisement

ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో రామ్చరణ్ సిద్ధ అనే పవర్ ఫుల్ రోల్ లో నటించాడు. చిరు కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తే రామ్ చరణ్ కు జోడిగా పూజా హెగ్డే నటించింది. వీరిద్దరూ కూడా ఈ సినిమాలో నటించడం వల్ల ఈ సినిమా పై మరింత ఆసక్తి పెరిగింది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ స్పీడ్ గా చేయాలని మేకర్స్ నిర్ణయించారు. దీంతో వరుసగా ఈ సినిమా నుండి అప్డేట్ లు ఉండేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూసిన మెగా ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. ఇక ఆ తర్వాత నిన్న ఈ సినిమా నుండి సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్లో చిరంజీవి, చరణ్ డాన్స్ తో అదర గొట్టారు.

Advertisement

వీరిద్దరిని ఒకే పాటలో పక్కపక్కన చూస్తుంటే మెగా ఫ్యాన్స్ కు కన్నుల పండుగగా ఉంది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి మరొక అప్డేట్ బయటకు వచ్చింది.తాజాగా ఈ సినిమా టోటల్ రన్ టైం ఎంతో బయటకు వచ్చింది అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా 126 నిమిషాల నిడివి కట్ చేశారట. అంటే మొత్తం 2 గంటల 46 నిమిషాలు అన్నమాట మరి ఈ రన్ టైం పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా.. మ్యాట్నీ మూవీ మేకర్స్ కొణిదెల ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ కంపెనీ సంయుక్తంగా నిర్మించారు.

ఇవి కూడా చదవండి :

  1. యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి..? దాని వ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి..?
  2. బాహుబ‌లి సినిమాలో త‌మ‌న్నా రోల్‌ను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?
  3. ది వారియ‌ర్ : బుల్లెట్ సాంగ్ పై రాక్‌స్టార్ ఏమ‌న్నారో తెలుసా..?
Visitors Are Also Reading