Home » యాంకర్ అనిత చౌదరికి హీరో శ్రీకాంత్ మధ్య రిలేషన్ ఏంటంటే..?

యాంకర్ అనిత చౌదరికి హీరో శ్రీకాంత్ మధ్య రిలేషన్ ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా మంచి పేరు తెచ్చుకున్న అనిత చౌదరి ఆ తర్వాత మెల్లిమెల్లిగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు అందుకుంది. అయితే అనిత చౌదరి అంటే చాలామందికి తెలియకపోవచ్చు కానీ చత్రపతి సినిమాలో” సూరీడు, సూరీడు, బస్సుకు యాళ్ళ ఐతుంది రా.. అంటూ పిలిచే క్యారెక్టర్ అందరికీ గుర్తుండిపోతుంది. అందులో ఈ క్యారెక్టర్ చేసింది అనిత చౌదరి. ఈ సినిమా ద్వారా మంచి పేరు సంపాదించుకుంది ఈమె. అలాంటి అనితా చౌదరికి ప్రస్తుతం ఇండస్ట్రీలో అక్క, చెల్లి, వదిన పాత్రలు చేస్తూ దూసుకుపోతోంది. బుల్లితెరపై చేసిన సీరియల్స్ ఋతురాగాలు, కస్తూరి నాన్న వంటి వాటిలో నటించింది.

Advertisement

ALSO READ;డైలాగ్స్ ఎలా చెప్పాలో బాలయ్యకు చేసి చూపించిన SR:NTR.. ఏ సినిమా అంటే..?

అయితే అనిత చౌదరి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టింది. మా పేరెంట్స్ ది లవ్ మ్యారేజ్.. కానీ మా నాన్న మా మమ్మీని వదిలేసి వెళ్లడంతో మా అమ్మ మా బాగోగులు మొత్తం చూసుకునేది. దీంతో నేను కూడా చిన్నతనంలోనే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకోవాల్సి వచ్చింది. అందుకే నేను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. కానీ చివరికి నా భర్త కృష్ణ చైతన్యను చూసి మొదటి చూపులనే ఇష్టపడ్డాను. కానీ ఆయన అమెరికాలో ఉండేవారు. నేను మాత్రం నువ్వు అమెరికాలో ఉంటే వివాహం చేసుకోనని తెగేసి చెప్పేసాను. ఆయన ఎంత ప్రేమగా ప్రపోజ్ చేసినా రిజెక్ట్ చేస్తూ వచ్చాను. కృష్ణ చైతన్య కి హీరో శ్రీకాంత్ కజిన్ అవుతారట.

Advertisement

ఓ రోజు శ్రీకాంత్ స్వయంగా నాకు కాల్ చేశారు. ఆ హీరో నుండి ఫోన్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. శ్రీకాంత్ ఫోన్ చేసి మా వాడు నిన్ను మ్యారేజ్ చేసుకోవడం కోసం అమెరికా నుండి వచ్చారు అని చెప్పాడు. అతన్నీ పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగారు.. దీంతో అనిత చౌదరికి కోపం వచ్చిందట.. తానే వచ్చి స్వయంగా ప్రపోజ్ చేయకుండా ఇలా ఫోన్స్ చేయించడం ఏంటని కృష్ణ చైతన్యతో మూడేళ్లు మాట్లాడలేదని చెప్పుకొచ్చింది.. మూడు సంవత్సరాల తర్వాత కృష్ణ స్వయంగా వచ్చి ప్రపోజ్ చేయడంతో పెళ్లికి ఒప్పేసుకుందని ఆ ఇంటర్వ్యూలో తెలియజేసింది అనిత చౌదరి. ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

ALSO READ;వైరల్ అవుతున్న శ్రీకాంత్ – ఊహ విడాకుల వార్తలు….ఇందులో నిజం ఎంత..?

Visitors Are Also Reading