Home » డైలాగ్స్ ఎలా చెప్పాలో బాలయ్యకు చేసి చూపించిన SR:NTR.. ఏ సినిమా అంటే..?

డైలాగ్స్ ఎలా చెప్పాలో బాలయ్యకు చేసి చూపించిన SR:NTR.. ఏ సినిమా అంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో అలనాటి మేటి నటుల్లో ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలుసు.. ఆయన నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా మారారు బాలకృష్ణ. అలాంటి బాలకృష్ణ ఆ సినిమాలో డైలాగ్స్ చెప్పడం రాకుంటే ఎన్టీఆర్ స్వయంగా చెప్పి చూపించారట.. మరి ఆ సినిమా ఏంటి వివరాలు చూద్దాం.. మద్రాసులో చాలా ఏళ్ల తర్వాత ఒక తెలుగు చిత్రమైన “భైరవద్వీపం” ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి ఎంతో మంది స్టార్ హీరోలు హాజరయ్యారు.

Advertisement

ALSO READ:ఇక్క‌డ నో చెప్ప‌డం కూడా ఒక క‌ళ‌నే..ప్రియ‌దర్శి షాకింగ్ కామెంట్స్..!

ఈ చిత్ర ప్రారంభోత్సవానికి చిరంజీవి, రజనీకాంత్ రామానాయుడు, అల్లు అరవింద్, అల్లు రామలింగయ్య, ఒక్కొక్కరిగా వస్తున్నారు. అలా కొంత సమయం గడిచాక ఎన్టీఆర్ కూడా వచ్చేశారు. ఎన్టీఆర్ ను చూడగానే రజినీకాంత్ ఆయన దగ్గరికి వెళ్లి పాదాభివందనం చేశారు. సినిమా ముహూర్త సమయం దగ్గరికి వస్తుండటంతో అందరు సెట్ లోకి వెళ్లారు. వృద్ధాప్యం కారణంగా చక చక నడవలేకపోతున్న నాగిరెడ్డికి ఎన్టీఆర్ తన చేతితో పట్టుకొని నడిపించారు. సెట్ లోకి వెళ్లారు.. అప్పటికే బాలకృష్ణ, రోజా, రంభ మేకప్ తో రెడీగా ఉన్నారు. “ఏమి ఈ విస్మయము” అనే డైలాగ్ బాలకృష్ణ చెప్పాలి. కానీ ఆయన తడబడుతున్నారు.. దీంతో ఎన్టీఆర్ రంగంలోకి దిగి తానే నటించి చూపించారు. దీంతో అక్కడున్న వారంతా కరతాల ధ్వనులతో శబ్దం చేశారు.. ఈ విధంగా చిరంజీవి కెమెరా స్విచ్ ఆన్ చేశారు, రజనీకాంత్ తొలి క్లాప్ ఇచ్చారు.

Advertisement

కెమెరాకు ఒకపక్క ఎన్టీఆర్ మరోపక్క చిరంజీవి నిలబడి మొదటి షాట్ తీయించారు. ఈ విధంగా ప్రారంభమైన భైరవద్వీపం చిత్రం పూర్తి కావడానికి కొన్ని నెలలు పట్టింది. దాదాపుగా నాలుగు కోట్లకు పైగా బడ్జెట్ తో మొదటి కాపీ సిద్ధమైంది. 1994 ఏప్రిల్ 14న సురేష్ పంపిణీ సంస్థ ద్వారా నిర్మాత వెంకట్రామిరెడ్డి సినిమా విడుదల చేశారు. మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో జానపద హీరోగా బాలకృష్ణ అందరి మన్ననలు పొందారు. 48 సెంటర్స్ లో ఈ చిత్రం 100 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది.

ALSO READ:

Visitors Are Also Reading