Home » నోబాల్ కూడా కాదు.. శ్రేయస్ అయ్యర్ క్లీన్ బౌల్డ్ అయినా అంపైర్ ఔట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి ? 

నోబాల్ కూడా కాదు.. శ్రేయస్ అయ్యర్ క్లీన్ బౌల్డ్ అయినా అంపైర్ ఔట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి ? 

by Anji
Ad

క్రికెట్ చరిత్రలోనే ఊహించని సంఘటన భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ టీమ్ కి చెందిన హుస్సెన్ 84 ఓవర్ లో శ్రేయస్ అయ్యర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయినప్పటికీ అక్కడ గమత్తు ఏమిటంటే.. బాల్ వికెట్లకు తగిలిన బెయిల్స్ మాత్రం కింద పడలేదు. దీంతో బాల్ తగిలిన వెంటనే బెయిల్ వికెట్ పై నుంచి లేచి మళ్లీ యధావిధిస్థానంలో అంచున ఉండిపోయాయి. ఈ పరిణామంతో బంగ్లాదేశ్ టీమ్ మొత్తం సంబురాలు చేసుకోగా.. శ్రేయస్ అయ్యర్ మాత్రం క్రీజ్ వదలకుండా అదేవిధంగా నిలబడటంతో అంపైర్ కూడా నాటౌట్ ప్రకటించాడు. 

Advertisement

బంగ్లాదేశ్ బౌలర్ ఆశ్చర్యపడి వికెట్ చుట్టూ గుమ్మగుడి ఇదేం వింత అన్నట్టు చూసారు. శ్రేయస్ చాలా తెలివిగా బేల్స్ కింద పడితేనే అవుట్ అన్న  రూల్స్ గ్రహించి అలా నిలబడడంతో అంపైర్ కూడా అవుట్ ఇవ్వలేదు. ఇదే సమయంలో నాన్ స్ట్రైకర్ లో ఉన్న చటేశ్వర్ పుజారా ఈ సీన్ చూసి నవ్వులు చిందించాడు. మామూలుగా అయితే ఈ తతంగం మొత్తం రివ్యూ చూసిన స్టంప్స్ పైన ఉండే బెల్స్ పైకి లేచి కాస్త పక్కకు ఒదిగాయి. ఇదిలా ఉంటే అంతకు ముందు ఉన్న బెయిల్ లైట్ వెలగడం లేదని దాని స్థానంలో కొత్త బెయిల్ పెట్టడం విశేషం.  

Advertisement

Also Read :  ఫిఫా ఫైనల్ తరువాత రిటైర్మెంట్ ప్రకటించనున్న అర్జెంటీనా స్టార్ ప్లేయర్..?

ఇక అదే కొంప ముంచిందని బంగ్లా క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా బెయిల్స్ తాగి లైట్లు వెలిగిన అవుట్ ఇవ్వకపోవడం అన్యాయం అని.. మరికొంత మంది మండిపడిపోతున్నారు. ఈ రూల్ మార్చాలని.. లేకపోతే బౌలర్లకు తీవ్ర అన్యాయం చేసినట్టే అవుతారని అంటున్నారు. ఇదిలా ఉంటే..  తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. ఓపెనర్స్ టాప్ ఆర్డర్స్ మొత్తం కుప్పకూలిపోయింది. శ్రేయస్ అయ్యర్ 82 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 

Also Read :  Andrew Flintoff : ఆండ్రూ ఫ్లింటాఫ్ కు యాక్సిడెంట్.. హెలికాఫ్టర్ లో తరలింపు

Visitors Are Also Reading