Home » రాజమౌళి ఈ స్టార్ హీరోలతో సినిమా చేయకపోవడానికి కారణం ఏంటి..?

రాజమౌళి ఈ స్టార్ హీరోలతో సినిమా చేయకపోవడానికి కారణం ఏంటి..?

by Anji
Ad

టాలీవుడ్ స్టార్ దర్శకులలో రాజమౌళి ఒకరు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించినటువంటి మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమా ఎంతటి సంచలన విజయాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. అదేవిధంగా ఆస్కార్ అవార్డుకి కూడా నామినేట్ అయింది నాటు నాటు సాంగ్. ప్రధానంగా భారీ బడ్జెట్ చిత్రాలకు, ప్రధానంగా గ్రాఫిక్స్ తో తెరకెక్కే సినిమాలకు దర్శకుడు రాజమౌళి కేరాఫ్ అడ్రస్ అయ్యారనే చెప్పాలి. 

Advertisement

రాజమౌళి సినిమాలు అంటే.. ప్రేక్షకులలో ఏదో తెలియని ఆసక్తి ఉంటుంది. ఇప్పటివరకు రాజమౌళి ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి హీరోలతో ఎక్కువగా సినిమాలు చేశాడు. అదేవిధంగా రవితేజ, సునీల్, నాని వంటి హీరోలతో కూడా సినిమాలు చేసాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ సినిమా తెరకెక్కించనున్నాడు. మెగా హీరోలతో మాత్రం జక్కన్న ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. వీరు స్టార్ హీరోలు అయినప్పటికీ జక్కన్న వీరితో ఒక్క సినిమా కూడా తీయలేదు. రాజమౌళి మెగా హీరోలతో సినిమాలు చేయకపోవడానికి గల కారణం ఏంటి అని అందరూ చర్చించుకుంటున్నారు. చిరంజీవి, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లతో రాజమౌళి ఇప్పటి వరకు పని చేయలేదు. చిరంజీవి రాజమౌళి దర్శకత్వంలో పని చేసేందుకు ఆసక్తి చూపించినా.. రాజమౌళి మాత్రం రిస్క్ తీసుకోవాలని భావించడం లేదట.  

Advertisement

Also Read :   సెలబ్రిటీలు తమ పిల్లల ముఖాలను సోషల్ మీడియాలో ఎందుకు దాచుకుంటారో తెలుసా ?

చిరంజీవి వయస్సు ఎక్కువ కావడంతో రిస్క్ షాట్స్ తీయడం చాలా కష్టం అని.. అదే సమయంలో సీనియర్ హీరోలతో తనకు నచ్చినట్టు వర్క్ చేయించుకోవడం అంతా సులువు కాదు అని.. జక్కన్న భావిస్తున్నట్టు జనాలు చర్చించుకుంటున్నారు. ఈ కారణాల వల్లనే రాజమౌళి దర్శకత్వంలో చిరంజీవి సినిమా తెరకెక్కలేదని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో రాజమౌళి విక్రమార్కుడు సినిమా తీయాలని చూసినా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేదు. ప్రస్తుతం పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉండటంతో రాజమౌళి ఈ హీరోతో పని చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. రాబోయే రోజుల్లో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చే ఛాన్స్ లేదు. మరో స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా జక్కన్న సినిమా తీయలేదు. ముందు ముందు మెగా హీరోలతోసినిమా తీస్తాడో లేదో వేచి చూడాలి మరి.  

Also Read :  శర్వానంద్ కు కాబోయే భార్య అన్ని కోట్లకు వారసురాలా…?

Visitors Are Also Reading