Home » చంద్రబాబు విషయంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒకేమాట మీద ఉండటానికి కారణమేంటి..?

చంద్రబాబు విషయంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒకేమాట మీద ఉండటానికి కారణమేంటి..?

by Anji
Ad

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజు రోజుకు చాలా రసవత్తరంగా మారుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీడీపీ-జనసేన  పొత్తులు పెట్టుకుంటున్నట్టు ప్రకటించాయి. ఇదిలా ఉంటే.. ఇవాళ సీఎం జగన్ స్పందిస్తూ.. ములాఖత్ కి వెళ్లి మిలాఖత్ అయ్యారని విమర్శలు చేశారు.

Advertisement

చంద్రబాబు అరెస్ట్ పై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వనీదత్ పాటు పలువురు చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. ఇంత జరుగుతున్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం పెదవి విప్పడం లేదు. అసలు ఏం జరిగింది. వీరిద్దరూ ఎందుకు ఖండించడం లేదనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఎన్టీఆర్ నే అడిగి తెలుసుకోవమన్నారు. నందమూరి కుటుంబం నుంచి అందరూ నిరసనల్లో పాల్గొనడంతో పాటు చంద్రబాబు కుటుంబం దగ్గరే ఉంటూ వారికి ధైర్యం చెబుతున్నారు.

Advertisement

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం మౌనంగానే ఉంటున్నారు. గత కొంత కాలంగా వీరిద్దరూ అన్నదమ్ములు ఒకే మాటపై ఉంటున్నారు. హరికృష్ణ మరణించిన తరువాత వీరి మధ్య బంధం మరింత బలంగా తయారైంది. ఎన్టీఆర్ తాజాగా నటించే దేవర మూవీలో కూడా నిర్మాత భాగస్వామిని చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గీసిన గీటును కళ్యాణ్ రామ్ దాటడం లేదని.. వారిద్దరూ ఒకేమాటమీద ఉంటున్నారని.. ఎక్కడికి వెళ్లినా ఎవ్వరినీ కలిసినా కలిసే చేస్తున్నారని సినీ పరిశ్రమలో చర్చ కొనసాగుతుంది. చంద్రబాబు అరెస్ట్ విషయంలో కూడా స్పందించే అవకాశం లేదనే పలు కారణాలున్నాయని పేర్కొంటున్నారు. ప్రత్యక్షంగా మద్దతు తెలియజేయకపోయినా పరోక్షంగా అయినా తెలియజేయవచ్చు. కొద్ది రోజులు గడిస్తే .. కానీ  ఈ అన్నదమ్ముల మధ్య వైఖరి పూర్తిగా అర్థమవుతోంద. అప్పటి వరకు వేచ చూడమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

సైమా’ అవార్డ్స్ లో శ్రీలీల వేసుకున్న డ్రెస్ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఎన్టీఆర్ అభిమాని అంతలా హర్ట్ కావడానికి కారణం ఏంటి ? ఎమోషనల్ నోట్ వైరల్..!

Visitors Are Also Reading