సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో కైనా ఏ నటులకైనా వారి యొక్క మొదటి రెమ్యూనరేషన్ అనేది చాలా వరకు గుర్తుండిపోతుంది. అయితే ఇండస్ట్రీలోని ఆ స్టార్ హీరోల మొదటి పారితోషికం ఎంతో తెలుసుకోవాలని అభిమానులకు కూడా ఉంటుంది. అదే మన తెలుగు ఇండస్ట్రీలోని అగ్ర హీరోలలో కొందరు ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం..
మెగాస్టార్ చిరంజీవి:
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న హీరోలలో స్టార్ హీరోగా పేరుపొందిన మెగాస్టార్ చిరంజీవి తన మొదటి పారితోషికం 1116 రూపాయలు తీసుకున్నారట. ప్రస్తుతం దాదాపు 50 కోట్లకు పైగా అందుకుంటున్నారు. అంతేకాకుండా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోలలో మొదటి స్థానంలో ఉంటారు చిరు.
Advertisement
Jr: ఎన్టీఆర్:
also read:వాల్తేరు వీరయ్య ట్రైలర్ చూడగానే మీకూ ఇదే డౌట్ వచ్చిందా..? అంటే దానికి అర్థం..!
Advertisement
నందమూరి నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని జూనియర్ ఎన్టీఆర్ మొదటి పారితోషికం 4 లక్షలు. ప్రస్తుతం ఆయన పారితోషికం ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా తీసుకుంటారని టాక్.
అల్లు అర్జున్:
స్టైలిష్ స్టార్ గా పేరుపొందిన అల్లు అర్జున్ ఒక గొప్ప నటుడు.. ఆయన మొదటి సినిమాకు రాఘవేంద్రరావు ఇచ్చిన అడ్వాన్స్ ₹100. ఇక పుష్ప 2 కోసం 80 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నారని టాక్ .
విజయ్ దేవరకొండ:
ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పేరుపొందిన విజయ్ దేవరకొండ, ఇండస్ట్రీలోకి రాకముందు 500 రూపాయలు తీసుకొని ట్యూషన్ చెప్పేవాడు.. అలాంటి విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు పొందారు. ఈయన 10 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్.
also read: