Home » వాల్తేరు వీరయ్య ట్రైల‌ర్ చూడగానే మీకూ ఇదే డౌట్ వ‌చ్చిందా..? అంటే దానికి అర్థం..!

వాల్తేరు వీరయ్య ట్రైల‌ర్ చూడగానే మీకూ ఇదే డౌట్ వ‌చ్చిందా..? అంటే దానికి అర్థం..!

by AJAY
Published: Last Updated on
Ad

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన తాజా చిత్రం వాల్తేరు వీర‌య్య. ఈ సినిమాకు బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా శృతిహాస‌న్ న‌టించారు. అంతే కాకుండా ఈ సినిమాలో ర‌వితేజ ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించారు. మైత్రీమూవీమేక‌ర్స్ బ్యాన‌ర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో చిరంజీవి ఊర‌మాస్ లుక్ లో క‌నిపిస్తున్నారు. దేవీశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి స్వ‌రాలు స‌మ‌కూర్చారు.

Also  Read:  నువ్వు మాములోడివి కాదు బాబీ అన్నా… వాల్తేరు వీర‌య్య ఈ పంచ్ డైలాగ్ అక్కడ నుంచి లేపేసావా ?

Advertisement

 

ఇప్ప‌టికే ఈ సినిమా నుండి పార్టీ సాంగ్ విడ‌ద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఎక్క‌డ చూసినా బాస్ పార్టీ పాట‌నే వినిపిస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న థియేట‌ర్ ల‌లో విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఈ సినిమా ట్రైల‌ర్ ను కూడా ఇప్ప‌టికే విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా ఈ సినిమా ట్రైల‌ర్ మిలియ‌న్ల వ్యూవ్స్ తో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.

Advertisement

ట్రైల‌ర్ చూసిన త‌ర‌వాత అభిమానుల‌కు సినిమా పై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైల‌ర్ చూసిన త‌ర‌వాత ట్రోలర్స్ సినిమా స్టోరీ ఇదేనంటూ అంచ‌నాలు వేస్తున్నారు. వాల్తేరు వీర‌య్య ట్రైల‌ర్ లో ప్ర‌కాష్ రాజ్ డ్యూయ‌ల్ రోల్ లో న‌టించిన‌ట్టు క‌నిపిస్తోంది. మెయిన్ విల‌న్ గా డాన్ గా ప్ర‌కాష్ రాజ్ క‌నిపిస్తున్నాడు. అంతే కాకుండా ఓ షాట్ లో ప్ర‌కాష్ రాజ్ చిరుప‌క్క‌న క‌నిపిస్తున్నాడు.

waltair-verayya-review

waltair-verayya-review

అంటే చిరు బ్యాచ్ లో ఓ మెంబ‌ర్ లో క‌నిపిస్తున్నాడు. మ‌రోవైపు సినిమా ట్రైల‌ర్ లో చిరంజీవి వీడు నా ఎర నువ్వే నా సొర‌…అంటూ డైలాగ్ కూడా కొట్టాడు.

May be an image of 12 people, people standing and text that says "f Jalsa Adeyya Prasadu story... Ah dru_g Don ni pattukovadaniki verayya prakash ni Era Ga vadathadu anthe claps"

దాంతో త‌న బ్యాచ్ లోని ప్ర‌కాష్ రాజ్ పంపించి వీర‌య్య డాన్ ప్రకాష్ రాజ్ ను ప‌ట్టుకుంటాడ‌ని ఈ సినిమా క‌థ అదేన‌ని ట్రోలర్స్ మీమ్స్ ను క్రియేట్ చేస్తున్నారు. అయితే సినిమా అస‌లు క‌థ ఏంటి అన్న‌ది తెలియాలంటే థియేట‌ర్ కు వెళ్లి సినిమా చూడాల్సిందే.

ALSO READ : క్యాన్సర్ నుంచి కోలుకున్న తరువాత హీరోయిన్ హంసానందిని ఎలా మారిపోయిందో చూశారా..?

Visitors Are Also Reading