Home » పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, అబ్బాయి మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉండాలో తెలుసా..?

పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, అబ్బాయి మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉండాలో తెలుసా..?

by Sravanthi
Ad

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఒక మరచిపోలేని ఘట్టం అని చెప్పవచ్చు. ఈ ఘట్టాన్ని పూర్తి చేసిన ప్రతి మనిషి తర్వాత గట్టంలో వివిధ రకాల పరిస్థితులను అనుభవిస్తారు. ఆ ఆ పరిస్థితులను తట్టుకొని ఇద్దరు ముందుకు సాగితే సంసార జీవితం సాఫీగా ఉంటుంది, ఇందులో ఏం మాత్రం తేడా వచ్చినా ఇక సంసారంలో మంట పుట్టినట్టే. మరి అలాంటి పరిస్థితులు సంసార జీవితంలో రావద్దు అనుకుంటే తప్పనిసరిగా భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించాలి. మరి ఇద్దరూ అర్థం చేసుకోవాలి అంటే మెచ్యూరిటీ ఉన్న వారిని పెళ్లి చేసుకుంటే ఆలోచన శక్తి ఎక్కువగా ఉండటం వల్ల ఎలాంటి సమస్య వచ్చినా సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలా సాల్వ్ చేయాలంటే ఇద్దరి మధ్య ఏజ్ క్యాప్ అనేది ఏ విధంగా ఉంటే బాగుంటుందనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

Advertisement

 

also read:హీరో అవ్వాల్సిన ఆ వ్యక్తి మోహన్ బాబు వల్ల ట్రావెల్స్ ఓనరయ్యాడు.. ఎలా..?

Advertisement

ప్రస్తుత కాలంలో పెళ్లి చేసుకునే యువతీ యువకులు ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ అనేది తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటున్నారు. కొంతమంది వారి కంటే రెండేళ్లు చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, మరికొందరు సమానమైన వయసు ఉన్న వారిని ఇష్టపడతారు. ఏది ఏమైనా భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ అనేది తప్పనిసరి.. ఇక నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం.. దంపతుల మధ్య ఐదు నుంచి ఏడు ఏళ్ల గ్యాప్ ఉండడంవల్ల సంసార జీవితంలో ఎలాంటి కలతలు వచ్చిన వాదనలు ప్రతి వాదనలు చేసుకోకుండా సమస్య సాల్వ్ అయ్యే విధంగా ఆలోచిస్తారని అధ్యయనంలో తేలింది. చాలా మెచ్యూరిటీగా ఆలోచించి గొడవలు రాకుండా సర్దుకుపోతారట.

ఈ గ్యాప్ ఉన్నవారు అర్థం చేసుకుని ఆనందంగా జీవితాన్ని గడుపుతారని అధ్యయనంలో తేలింది. ఇక 10 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న దంపతుల మధ్య తేడాలు వస్తే విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వీరు సర్దుబాటు చేసుకోలేరని అధ్యయనంలో తేలింది.అంతేకాకుండా కొంతమంది అమ్మాయి అబ్బాయి వివాహ వయసు 20ఏళ్ల గ్యాప్ ఉంటుంది. ఇలాంటి వారు పెళ్లి చేసుకోవడం వేస్ట్. ఇంత గ్యాప్ తో పెళ్లి చేసుకుంటే అభిప్రాయ భేదాలు వచ్చి సంసారం సరిగ్గా సాగక, పిల్లలు కూడా పుట్టక అనేక సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో పెళ్లికి వయసు అనేది మ్యాటర్ కావడం లేదు. వారికి నచ్చిన వారిని పెళ్లి చేసుకొని హ్యాపీగా జీవిస్తున్న వారు ఉన్నారు, విడిపోతున్న వారు ఉన్నారు.

also read:

Visitors Are Also Reading