Home » హీరో కృష్ణ పై NTR అంత కక్ష కట్టారా.. ?

హీరో కృష్ణ పై NTR అంత కక్ష కట్టారా.. ?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీని ఓ రేంజ్ లో నిలబెట్టిన హీరోలలో ముఖ్యపాత్ర వహించింది ఎన్టీఆర్.. ఆయన ఇండస్ట్రీని టాప్ పొజిషన్లో నిలబెట్టడమే కాకుండా తాను కూడా స్టార్ హీరోగా ఎదిగారు. ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాలకు పెట్టింది పేరు. అయితే ఎన్టీఆర్ తో సమానంగా సూపర్ స్టార్ కృష్ణ కూడా నటనలో తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే ఇండస్ట్రీలో వీళ్లిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎన్టీఆర్ నటించిన దానవీరశూరకర్ణ, సూపర్ స్టార్ కృష్ణ నటించిన కురుక్షేత్రం సినిమాలు దాదాపుగా ఒకే కథాంశంతో తీశారు.

Advertisement

also read:హీరో అవ్వాల్సిన ఆ వ్యక్తి మోహన్ బాబు వల్ల ట్రావెల్స్ ఓనరయ్యాడు.. ఎలా..?

Advertisement

ఈ రెండు సినిమాలతో ఆర్టిస్టులు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు. కానీ కైకల సత్యనారాయణ మాత్రం రెండు సినిమాల్లో నటించి మెప్పించారు. ఈ తరుణంలోనే అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని కూడా ఎన్టీఆర్ చేద్దామని అనుకునే లోపు సూపర్ స్టార్ కృష్ణచేసి ఎన్టీఆర్ కు కోపం తెప్పించారు. అప్పట్నుంచి వీరిద్దరి మధ్య పది సంవత్సరాల పాటు మాటలు కట్ అయ్యాయి. ఈ తరుణంలోనే ఒకే కథాంశంతో వచ్చిన ఈ రెండు సినిమాలలో దానవీరశూరకర్ణ ఘనవిజయం అందుకోగా, కురుక్షేత్రం మూవీ మాత్రం అపజయం పాలైందని చెప్పవచ్చు.

కానీ ఎన్టీఆర్ సినిమాకు గట్టి పోటీ ఇచ్చింది. ఈ రెండు సినిమాలతో ఆర్టిస్టులు రెండుగా చీలిపోయారు కానీ, కైకల సత్యనారాయణ మాత్రం రెండిటిని కవర్ చేశారు. దీంతో ఎన్టీఆర్ సత్యనారాయణను పిలిచి మా సినిమాలో నటించాలి కానీ కురుక్షేత్రంలో నటించద్దని చెప్పారట. దీంతో కైకాల సత్యనారాయణ కురుక్షేత్రం సినిమా నే మొదట సైన్ చేసానని చెప్పడంతో తప్పక రెండు సినిమాల్లో నటించాల్సి వచ్చింది. కానీ దానవీరశూరకర్ణ ద్వారా ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందుకే ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది.

also read:

Visitors Are Also Reading