Home » ఈసారి సితార గట్టిగానే ప్లాన్ చేసిందిగా.. నెక్ట్స్ ఏం చేయబోతుందంటే..?

ఈసారి సితార గట్టిగానే ప్లాన్ చేసిందిగా.. నెక్ట్స్ ఏం చేయబోతుందంటే..?

by Mounika
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితారకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఆమె తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను, డాన్స్ వీడియోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. సితార ఏ పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. దీని బట్టి సితారకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఈ లిటిల్ ప్రిన్సెస్ తన అందంతో తండ్రికి తగ్గ తనయగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇలా మహేష్ బాబు గారాలపట్టి సితార గురించి ఎంత చెప్పినా తక్కువే.

Advertisement

చిన్న వయసులోనే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటోంది. అతి చిన్న వయసులోనే భారీగా అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా.. తనకంటూ స్పెషల్ స్టార్ స్టేటస్ ను క్రియేట్ చేసుకుంది సితార. ఇక సితార ఇటీవలే ఓ ఇంటర్నేషనల్ జ్యూవెలరీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ జువెలరీ బ్రాండ్ సితారతో చేసిన ఫోటోషూట్ లో ఓ బ్యూటిఫుల్ ఏంజెల్ లా అందరినీ ఆకట్టుకుంది. ఆ ఫొటోస్ సైతం అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బోర్డుపై మెరిసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పుడు సితార తన కెరీర్ లో తీసుకుబోయే నెక్ట్స్ స్టెప్ గురించి ఓ కొత్త సమాచారం వినిపిస్తుంది. సితార వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో తెలిస్తే ఖచ్చితంగా మాత్రం కచ్చితంగా ఆశ్చర్యపోతారు .

Advertisement

ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో ఎక్కడ చూసినా సితార పేరే వినిపిస్తుంది. అతి చిన్న వయసులోనే ఈ రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకున్న స్టార్ కిడ్స్ లో సితార నెంబర్ వన్ పొజిషన్లో ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దీనితో అందరి దృష్టి సితార నటనలో శిక్షణ తీసుకొని సినిమాలలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా.. నెక్స్ట్ ఏమి చేయబోతుందని తెగ అందరిలో ప్రశ్నలు మొదలయ్యాయి.

 

 

ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. సితార మిస్ యూనివర్స్ లేదా మిస్ వరల్డ్ పోటీలకు సిద్ధం కావాలని ఆశ పడుతుందని తెలుస్తోంది . తల్లి నమ్రతాను స్ఫూర్తిగా తీసుకొని ఆమె సలహా మేరకు సితార ఈ పోటీలకు సిద్ధం అవ్వాలని నిర్ణయించుకోవడం జరిగిందట. తల్లి నమ్రత కూడా మాజీ మిస్ ఇండియా కావడంతో సితారకు అందాల పోటీలకు కావలసిన మంచి శిక్షణ ఇవ్వగలదు.  ఇప్పటికే సితార భరతనాట్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. సితార మల్టీ టాలెంటెడ్ కావడంతో వాక్చాతుర్యంతో ఎంతో చక్కగా మాట్లాడి అందరిని ఆకట్టుకుంటుంది. సితారకి అందాల పోటీకి కావలసిన అన్ని అర్హతలు ఆమెలో ఉన్నాయి. సితార ఆశించినట్లు ఆమె అనుకున్న పొజిషన్ కి వెళుతుందా.. లేదా.. అనేది మాత్రం వేచి చూడాలి

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

ధనుష్ పెళ్లి ఫోటోలో కనిపిస్తున్న ఈ కుర్రవాడిని గుర్తుపట్టారా..? ప్రస్తుతం ఇతగాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..

ఆ హీరోయిన్ మైకంలో పడి రవితేజ తన భార్యకి విడాకులు ఇవ్వాలనుకున్నాడా..? 

హీరోయిన్‌ల రేంజ్‌లో సితార పారితోషికం.. జ్యూవెల్లరీ యాడ్‌ కోసం కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌

 

Visitors Are Also Reading