Home » హీరోయిన్‌ల రేంజ్‌లో సితార పారితోషికం.. జ్యూవెల్లరీ యాడ్‌ కోసం కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌

హీరోయిన్‌ల రేంజ్‌లో సితార పారితోషికం.. జ్యూవెల్లరీ యాడ్‌ కోసం కళ్లు చెదిరే రెమ్యునరేషన్‌

by Bunty
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి ఘట్టమనేని సితార…. అతి చిన్న వయసులోనే కూచిపూడి డ్యాన్సర్ గా, సోషల్ మీడియా స్టార్ గా భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ప్రపంచమంతా గర్వించదగ్గ మరొ గొప్ప ఘనతను చాటుకుంది. ఇటీవల తాజాగా ఒక ప్రతిష్టాత్మక జ్యువెలరీ షాప్ కి యాడ్ లో నటించిన సితార ఫోటోలను న్యూయార్క్ సిటీలోని టైమ్స్ స్క్వేర్ పై ఆ సంస్థ ప్రకటించింది. అమాయకమైన ముఖంతో, అందమైన నవ్వుతో, కుందనపు బొమ్మల కనిపించింది ఈ అమ్మడు.

Advertisement

అతి చిన్న వయసు ఉన్నప్పటికీ కూచిపూడి డ్యాన్స్ చేస్తూ దానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో పంచుకుంటుంది. 12 ఏళ్ల వయసులోనే ఒక స్టార్ హీరోయిన్ కు ఉన్నంత క్రేజ్ సంపాదించుకుంది. జువెలరీ షాప్ యాడ్ లో నటించి ప్రముఖ న్యూయార్క్ సిటీ లోని టైమ్స్ స్క్వేర్ పై ఈ అమ్మడు ఫోటోలను చూసి అందరూ ఫిదా అవుతున్నారు. అతి చిన్న వయసులోనే ఇంత పెద్ద ఘనత సాధించిన తొలి స్టార్ కిడ్ గా చరిత్ర సృష్టించింది. ఈ యాడ్ లో నటించినందుకు సితార ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందని కొంతమంది నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. దీనిలో నటించినందుకుగాను సితార ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని సమాచారం.

Advertisement

దానికి కారణం మహేష్ బాబు అని తెలుస్తోంది. ఆ జువెలరీ సంస్థ మాత్రం సితార కోసం ఒక డైమండ్ నెక్లెస్, బ్రేస్లేట్ లను పంపించినట్లు సమాచారం. ఇక మహేష్ బాబు పుత్రికోత్సాహంతో ఆనందంలో మునిగిపోతున్నారు. టైం స్క్వేర్ నే వెలిగించావు నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది తల్లి అంటూ ఆనందంలో మునిగిపోయారు. ఇక సితార మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీలకు రెడీ అవుతొందట. తన తల్లి ప్రోత్సాహంతోనే సితార ఈ పోటీలకు సిద్ధమవుతుందట. ఇక పోటీలో పాల్గొనేందుకు అర్హతలు రావాల్సి ఉందట. అందుకోసం ఇంకా సమయం పట్టే అవకాశం ఉందట. రానున్న రోజుల్లో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఇక సితార తన తండ్రినే మించిపోతుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

World Cup 2023 : ప్రపంచకప్ నుంచి పాక్ తప్పుకుంటే..అప్పుడు ఏ జట్టు ఆడుతుందో తెలుసా?

MS DHONI : కేవలం రూ. 30 లక్షల కోసమే క్రికెట్ లోకి వచ్చిన ధోని !

Tamim Iqbal : ప్రధాని వార్నింగ్.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న బంగ్లా కెప్టెన్ !

Visitors Are Also Reading