CAA: పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏంటి..? పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రంలోని మోడీ సర్కార్ అమల్లోకి తీసుకురావడం జరిగింది. దీంతో ఈ సిఏఏ ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుంటే అధిపారపక్షం మాత్రం స్వాగతం పలుకుతోంది. దీని మీద దేశ ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అసలు సిఏఏ ని ఎందుకు కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి..? దీనిపై ఎందుకు వివాదం కొనసాగుతోంది పౌరసత్వ సవరణ బిల్లు సిఐఏని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ 2019లో పార్లమెంటులో ప్రవేశపెట్టింది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ టెస్ట్ దేశాలకి ముస్లిం ఇతర వలసదారులకి భారతదేశ పౌరుసత్వం కల్పించడమే ఈ చట్టం యొక్క మెయిన్ ఉద్దేశం.
Advertisement
Advertisement
2014 డిసెంబర్ 31కి ముందు ఇండియాకి వలస వచ్చిన వాళ్ళు దీనికి అర్హులు. ఈ అర్హత కేవలం హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, పార్సీలు, బౌద్ధులకు మాత్రమే వర్తిస్తుందట. ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. భారత్ కి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతర వర్గాలకి వారికి భారత పౌరసత్వం కల్పించడానికి తీసుకువచ్చింది ఈ చట్టం. ముస్లిం సమాజం సంస్థలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. దేశ ఐక్యత సమగ్రతకి హాని కలిగిస్తుందని అందరూ అంటున్నారు సిఏఏ సాకుతో ముస్లింలని వేధించని కొన్ని ముస్లిమ్స్ సంస్థలు చెప్తున్నాయి. ముస్లింలను చేర్చకుండా ముస్లిం ఇతరులని ప్రస్తావించడం పట్ల ముస్లింలు మండిపడుతున్నారు.
సీఏఎ ని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత డిసెంబర్ 4 , 2019లో అసెంబ్లీలో ఆందోళన జరిగాయి పౌరసత్వ సవరణ చట్టంపై హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో ముస్లిం దేశాలు అని అన్నారు అక్కడ మెజారిటీ ముస్లింలు మతం పేరుతో అణచవేతికి గురికారు ఈ దేశంలో హిందువులతో సహా ఇతర వర్గాలకు చెందిన ప్రజలు మతము ఆధారంగా అణచివేతకి గురవుతున్నారని అందుకని ఈ దేశాల ముస్లింలని పౌరసత్వ చట్టంలో చేర్చలేదని అన్నారు. ఈ చట్టం నుండి ఈ భారత్ లో ముస్లింల పౌరసత్వానికి లేదా మతానికి వర్గానికి చెందిన వ్యక్తులకు ఏమి ముప్పు కూడా ఉండదు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!