Home » PRATHYUSHA : అందాల తార ప‌త్యూష విష‌యంలో అంత దారుణం జరిగిందా..!

PRATHYUSHA : అందాల తార ప‌త్యూష విష‌యంలో అంత దారుణం జరిగిందా..!

by AJAY
Ad

కొంత‌మంది హీరోయిన్ లు ప్రేక్షకుల‌కు ఎంత‌గానో ద‌గ్గ‌రై చిన్న‌వ‌య‌సులోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. అలా దూర‌మైన వారిలో హీరోయిన్ ప్ర‌త్యూష కూడా ఒక‌రు. ప్రత్యూష మోహ‌న్ బాబు హీరోగా న‌టించిన రాయుడు మ‌రియు శ్రీరాముల‌య్య స్నేహ‌మంటే ఇదేరా క‌లుసుకోవాల‌ని లాంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల‌కు ఎంత‌గానో ద‌గ్గ‌ర‌య్యారు.

ALSO READ : జ‌గ‌న్ చిరంజీవి భేటీపై న‌రేష్ ఆస‌క్తిక‌ర ట్వీట్..!

Advertisement

prathyusha

కానీ చిన్న వ‌య‌సులోనే ప్ర‌త్యూష చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు ఈ లోకానికి దూర‌మ‌య్యారు. అయితే ప్ర‌త్యూష చ‌నిపోవ‌డానికి కార‌ణం ఆమె ఇండ‌స్ట్రీకి చెందిన ఓ వ్య‌క్తితో ప్రేమ‌లో ప‌డ్డార‌ని ఆ విష‌యాన్ని త‌న త‌ల్లిదండ్రుల‌కు చెబితే ఒప్పుకోక‌పోవ‌డంతో చ‌నిపోయింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. మ‌రోవైపు ప్ర‌త్యూష చనిపోలేద‌ని చంప‌బ‌డింద‌ని కూడా వార్త‌లు వినిపించాయి. కొంత‌మంది రాజ‌కీయ నాయకుల కుమారుల వ‌ల్ల ప్ర‌త్యూష చనిపోయార‌ని ఆ విష‌యాన్ని వైద్యులు నిర్ధారించార‌ని కూడా క‌థ‌నాలు వ‌చ్చాయి.

Advertisement

కానీ రాజ‌కీయ నాయ‌కులు ప‌లుకుబ‌డి ఉన్న‌వాళ్లు కావ‌డంతో ప్ర‌త్యూష‌నే చ‌నిపోయిన‌ట్టు గా శృష్టించార‌ని కూడా క‌థ‌నాలు వ‌చ్చాయి. అంతే కాకుండా ఈ కేసును కూడా త్వ‌ర‌గా మూసి వేయ‌డం ప‌లు అనుమానాల‌కు దారితీసింది. దాంతో నింధితుల‌ను ప‌ట్టుకోవాల‌ని క‌ఠినంగా శిక్షించాల‌ని ఇండ‌స్ట్రీకి చెందిన కొంత‌మంది గ‌ళం విప్పారు.

అభిమానులు కూడా ప్ర‌త్యూష మ‌ర‌ణ‌వార్త‌ను త‌ట్టుకోలేక‌పోయారు. ఎంతో అందంగా ప‌క్కింటి అమ్మాయిలా క‌నింపించే ప్ర‌త్యూష దూరం అవ్వ‌డంతో ఆవేద‌న వ్యక్తం చేశారు. కొంత కాలం పాటూ నింధితుల‌ను శిక్షించాల‌ని డిమాండ్ చేసారు. కానీ కొంత‌కాలానికి ఈ కేసు పూర్తిగా మ‌రుగున ప‌డిపోయింది.

Visitors Are Also Reading