సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి ఇతర సీనిపెద్దలు సమావేశమైన సంగతి తెలిసిందే. కాగా జగన్ తో చిరు భేటీ పై నటుడు నరేష్ సోషల్ మీడియాలో స్పందించారు. ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల భేటీ ప్రశంసించదగ్గది అన్నారు. అయితే ఫిలిం చాంబర్ అవసరాల కోసం ఫిలించాంబర్ ఆద్వర్యంలో ఒక వర్క్ షాప్ పెట్టడం చాలా అవసరమని చెప్పారు. ప్రభుత్వం ప్రజాసమస్యలను తీర్చేలా..ప్రజల ఆత్మగౌరవాన్ని పొందేలా చర్చలు జరిపి సమస్యలను తీర్చాలని నరేష్ పేర్కొన్నారు.
త్వరలోనే ఫిలిం చాంబర్ ఆద్వర్యంలో వర్క్ షాప్ జరుగుతుందని నరేష్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా త్వరలోనే గుడ్ న్యూస్ వినబోతున్నారని సీఎంతో సమావేశం అనంతరం హీరోలు చెప్పిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా చిన్న సినిమాలు ఐదు షోలు వేసుకునే వెసులుబాటు ను కూడా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఈ చర్చల్లో చిరు కీలకంగా వ్యవహరించడంతో ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి.