జగన్ షర్మిల మధ్య అసలు గొడవేంటి…? అన్న చెల్లెళ్లు ఎందుకు విడిపోయారు..? వీళ్ళ మధ్య అసలు ఏం జరుగుతుంది అనే విషయాలు చాలా మందికి తెలియనివి. తెలుసుకోవాలనుకుంటున్నవి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్య అసలు సమస్య ఏంటి..? అన్నతో విభేదించి చెల్లెలు ఎందుకు వేరే పార్టీలో చేరారు..? మొదట తెలంగాణలో రాజకీయం మొదలుపెట్టిన షర్మిల ఎన్నికల టైం లో ఆంధ్రలోకి ఎందుకు అడుగుపెట్టారు..? జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు అన్న కోసం పాదయాత్ర చేశారు షర్మిల. తర్వాత క్రమంగా వైసీపీలో ఫేడ్ అవుట్ అయిపోయారు. ఏపీలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సీఎం అయిన తర్వాత షర్మిల అసలు రాజకీయాల్లో కనపడమే మానేశారు.
Advertisement
సడన్ గా వైయస్సార్ తెలంగాణ పార్టీ అని తెలంగాణలో రాజకీయాన్ని మొదలుపెట్టారు షర్మిల ప్రజాప్రస్థానం అని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ అవుతున్న టైంలో జగన్ షర్మిల ని తెలంగాణ రాజకీయాల్లోకి పంపించారని కొత్త కథనాలు వచ్చాయి. కేసీఆర్ కి అనుకూలంగా రెడ్డి సామాజిక వర్గపు ఓటర్లని కాంగ్రెస్ వైపు వెళ్ళిపోకుండా చూసేందుకు ఎత్తుగడవేశారని వార్తలు కూడా వచ్చాయి. అయితే తెలంగాణలో షర్మిల పోటీ చేయకుండానే పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు తర్వాత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నారు. ఏపీసీసీ చీఫ్ గా ఎన్నికయ్యాక షర్మిల తన కొడుకు రాజారెడ్డి పెళ్లి చేశారు షర్మిల కొడుకు ఎంగేజ్మెంట్ కి కూడా అంటీముట్టనట్టు వ్యవహరించారు జగన్ ఫోటో దిగడానికి కూడా ఆసక్తి చూపించలేదు.
Advertisement
Also read:
Also read:
అప్పట్లో ఇది హాట్ టాపిక్ అయిపోయింది. ఏపీలో ఎన్నికల ప్రచారం మొదలైన తర్వాత జగన్ మీద విమర్శలు చేశారు. షర్మిల ఢిల్లీలో బిజెపి ముందు సలాం కొట్టేవాళ్ళు రాజశేఖర్ రెడ్డి వారసులు ఎలా అవుతారని నేరుగా జగన్ పైన ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి జగన్ మీద షర్మిల విమర్శలు చేశారు. కడప ఎంపీ స్థానానికి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న షర్మిల శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆస్తులు వివరాలను కూడా అందించారు. అయితే షర్మిల వ్యాఖ్యలతో అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తి విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. చెల్లికి కొసరు ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్లు చూపించే వాళ్ళు కూడా ఉన్నారని షర్మిల అనడంతో కచ్చితంగా ఆస్తి గొడవలే ఉన్నాయని అంతా అభిప్రాయపడుతున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!