Home » ఉదయాన్నే ఇడ్లీ వడ దోశ లాగించేస్తున్నారా…? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

ఉదయాన్నే ఇడ్లీ వడ దోశ లాగించేస్తున్నారా…? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

by AJAY
Ad

కాలం మారుతున్న కొద్ది మనుషుల ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. ఒకప్పుడు మన సాంప్రదాయ ఆహారాన్ని తినేవారు. కానీ ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి ఏది పడితే అది తింటున్నారు. ఉదయం ఎక్కువగా టిఫిన్ లు… రాత్రి అయితే పిజ్జా, బర్గర్ అంటూ విదేశీ ఫుడ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మరికొందరు ఉదయం రాత్రి టిఫిన్ లు తింటూ మధ్యాహ్నం ఒక్కపూట మాత్రం రైస్ లేదా చపాతీ తింటున్నారు.

Advertisement

కానీ ఇడ్లీ దోశ వడ లాంటి టిఫిన్ లు ఎక్కువ తిన్నా కూడా అనారోగ్యం భారిన పడక తప్పదు అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానికంటే రెండు పూటలా అన్నం తింటూ ఉదయం టిఫిన్ చేయడం ఉత్తమం అని చెబుతున్నారు. సన్నబడటం కోసం రెండు పూటలు టిఫిన్ చేసి ఒక పూట అన్నం తింటే అది అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Advertisement

సాధారణంగా మినుపప్పు ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. కానీ మినప్పప్పు లో బియ్యం కంటే ఎక్కువ క్యాలరీలు ఉంటాయని చెబుతున్నారు. దానివల్ల అతిగా తింటే షుగర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా ఒకప్పుడు ఉదయం చద్దన్నం తినేవారు. దాంతో కడుపులో మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందేది. కానీ ఇప్పుడు టిఫిన్ లు తినడం వల్ల కడుపులోని మంచి బ్యాక్టీరియా పెరగకపోగా జీర్ణ వ్యవస్థ వీక్ అవుతుంది అని చెబుతున్నారు.

దాంతో జీర్ణ సమస్యలతో పాటు కీళ్ళవాతం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా టిఫిన్ లతో ఎక్కువగా చట్నీలు తినడం వల్ల ఎసిడిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి సాంప్రదాయ ఆహారాలు అలవాటు చేసుకోవాలని…. ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Visitors Are Also Reading