తాజాగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి చెందారు. విశాఖ నుంచి వస్తూ అనారోగ్యానికి గురయిన రాకేష్ మాస్టర్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ మృతి చెందారు. హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణించినట్లు తెలిసింది.
Advertisement
1500 లకు పైగా సినిమాలకు కొరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ తెలుగు పరిశ్రమలో తిరుగులేని కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. కానీ, అకస్మాత్తుగా ఆయన మరణంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ఆయనకు చాలా ప్రతిభ ఉన్నప్పటికీ.. తన ముక్కుసూటితనం కారణంగా చాలా విమర్శల పాలయ్యారు కూడా. ఆయన మరణం వెనుక అనేక విషయాలు ఇప్పుడు బయటపడుతున్నాయి.
Advertisement
ఆయనకు చికిత్స చేసిన వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ లో ఫుడ్ పాయిజనింగ్ అని ఉందట. ఎవరైనా ఆయన తిన్న ఫుడ్ లో విషం కలిపారా? అన్న అనుమానాలు అభిమానుల్లో కలిగాయి. రాకేష్ మాస్టర్ ఉన్నన్ని రోజులూ హ్యాపీగా ఉండాలి అన్న ఉద్దేశ్యంతో ఎక్కువగా తినేసి దాదాపు 20 బాటిల్స్ వరకు ఆల్కహాల్ తీసుకున్నారట. దీనితో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఆయన ప్రాణాల మీదకి వచ్చింది. ఇంత ఫుడ్ తీసుకుని ఎర్రటి ఎండలో శ్రీకాకుళం చుట్టారట. దీనితో వడదెబ్బ కొట్టి ఆసుపత్రిలో చేరారు. అయినా, ఆయనకు ప్రాణాలు దక్కలేదు.
మరిన్ని ముఖ్య వార్తలు:
SV కృష్ణా రెడ్డి, చిరంజీవి కాంబినేషన్ లో సినిమా ఎందుకు మిస్ అయిందంటే ?
“ఎన్టీఆర్” బ్లాక్ బస్టర్ “స్టూడెంట్ no 1 ” సినిమాని చేతులారా మిస్ చేసుకున్న హీరో ఎవరంటే ?
మొదట ప్లాప్ టాక్ ని అందుకొని ఆ తర్వాత సెన్సేషనల్ హిట్ అయిన మహేష్ బాబు చిత్రాలు ఏవో తెలుసా..?