Home » మొదట ప్లాప్ టాక్ ని అందుకొని ఆ తర్వాత సెన్సేషనల్ హిట్ అయిన మహేష్ బాబు చిత్రాలు ఏవో తెలుసా..?

మొదట ప్లాప్ టాక్ ని అందుకొని ఆ తర్వాత సెన్సేషనల్ హిట్ అయిన మహేష్ బాబు చిత్రాలు ఏవో తెలుసా..?

by Mounika
Ad

సినిమా ఇండస్ట్రీ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న స్టార్ ఇమేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన సినిమాలు ఎప్పుడు థియేటర్లో రిలీజ్
అవుతాయా అంటూ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన నటించిన ఏ సినిమా అయినా సరే బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటాయి. మహేష్ బాబు తో సినిమా అంటే నిర్మాతలకు సైతం కాసుల వర్షం కురిపించినట్లే. మహేష్ బాబు తీసే ప్రతి సినిమాల్లో  వేరియేషన్ చూపిస్తూ కొత్త రికార్డులను సృష్టిస్తారు. అలాంటి సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ మొదటిలో కూడా కొన్ని చిత్రాలు రిలీజ్ రోజే ప్లాప్ టాక్ ని అందుకొని ఫైనల్ గా బ్లాక్ బస్టర్ హిట్ గా సక్సెస్ ను సాధించాయి. అలా మహేష్ బాబు కెరీర్ లో ప్లాప్ టాక్ నుంచి హిట్ ట్రాక్ లోకి వెళ్లిన ఆ చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Advertisement

#1. ఒక్కడు :

గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు, భూమిక జంటగా నటించిన ఒక్కడు చిత్రం మొదటిలో ప్లాప్ టాక్ ని అందుకొని ఆ తర్వాత బ్లాక్ పాస్టర్ హిట్గా నిలిచింది. సినిమా షూటింగ్ పూర్తైన త‌ర్వాత కొంద‌రు సినీ ప్ర‌ముఖులు ఒక్క‌డు కాపీ చూసి రిజ‌ల్ట్ పై అనుమానాలు వ్య‌క్తం చేసి సినిమా ఫ్లాప్ అవుతుందని అభిప్రాయాలు తెలిపారట.

అంతేకాకుండా ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్, డైరెక్ట‌ర్ గుణ‌శేఖర్ కు సినిమాలో కొన్ని మార్పులు చేయ‌మ‌ని సలహాలు కూడా ఇచ్చారట. అంతే కాకుండా మొద‌ట గుణ‌శేఖ‌ర్ ఈ చిత్రానికి అతడే ఆమె సైన్యం అనే పేరు అనుకోవడం జరిగిందట. సినీ ప్రముఖుల సూచ‌న‌ల మేర‌కు గుణ‌శేఖ‌ర్ ప‌లు మార్పులు చేర్పులు చేసి ఒక్కడు టైటిల్తో 2003 లో ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దింపారు. అలా మొదటి ప్లాప్ టాక్ అందుకొని ఒక్కడు చిత్రం ఫైనల్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

Advertisement

#2. పోకిరి :

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు ఇలియానా జంటగా నటించిన పోకిరి సినిమాలో మహేష్ బాబు ఫుల్ మాస్ లుక్ లో కనిపిస్తాడు. దాంతో అందరికీ మహేష్ బాబు లుక్ కొత్తగా అనిపించడంతోని మొదట ఈ సినిమా ప్లాప్ టాక్ ని అందుకుంది. కానీ ఈ సినిమానే ఆ తర్వాత అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్ లని బ్రేక్ చేసి ఇండస్ట్రీ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. అలా మహేష్ బాబు కెరియర్ లో ఈ రెండు సినిమాలు ఆయన్ని స్టార్ నుంచి సూపర్ స్టార్ గా మాచేసాయి.

ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన  టీజర్ కూడా ఇప్పటికే రిలీజ్ అయ్యి అందర్నీ ఆకట్టుకుంటుంది. వచ్చే ఏడాది జనవరి 14 కు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

బలగం లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని చేతులారా వదులుకున్న ఆ హీరో ఎవరో తెలుసా..?

“రాముడికి మీసాలు ఏంట్రా ?” అంటూ ట్రోల్ చేసిన వాళ్ళకి ఓసారి ఈ స్టోరీ చూపించండి!

థియేటర్లలో ఫ్లాప్ అయ్యి.. టివిలో వస్తే, ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యింది అనిపించే సినిమాలు! లిస్ట్ ఓ లుక్ వేయండి!

Visitors Are Also Reading