Home » వెయ్యి మంది బాలకృష్ణలు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ను ఏం చేయలేరు.. కొడాలి నాని కామెంట్స్ వైరల్..!

వెయ్యి మంది బాలకృష్ణలు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ను ఏం చేయలేరు.. కొడాలి నాని కామెంట్స్ వైరల్..!

by Anji

జూనియర్ ఎన్టీఆర్ కు  NTR ఘాట్ వద్ద ఘోర అవమానం ఎదురయింది. సీనియర్ ఎన్టీఆర్ 28వ వర్ధంతి కావడంతో జూనియర్ ఎన్టీఆర్ ని ఘోరంగా అవమానించారు నందమూరి బాలయ్య. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు.  బాలకృష్ణ ఆదేశాల మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించినట్లు తెలుస్తోంది.

అయితే ఇదిలా ఉంటే.. తాజాగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపు పై ఆయన స్పందించారు.  వాళ్లది నీచాతి నీచమైన బుద్ధి అని.. వెయ్యి మంది బాలకృష్ణలు, చంద్రబాలు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ని ఏం చేయలేరు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ఏమీ చేయలేరు. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన వారు ఎన్టీఆర్ వర్థంతి చేస్తారా..? మండి పడ్డారు కొడాలి నాని.

ఎన్టీఆర్ సమాది సాక్షిగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి.  ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీర్ కి సంబంధిన ఫ్లెక్సీలు తొలగించారు బాలయ్య అనుచరులు. బాలకృష్ణ ఆదేశాల మేరకే ఫ్లెక్సీలను తొలగించినట్టు తెలుస్తోంది. బాలకృష్ణ అక్కడికి వచ్చి వెళ్లిన మరు క్షణమే ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడం గమనార్హం.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading