Home » రాగిజావ తాగితే ఇన్ని ప్రయోజనాలా..?

రాగిజావ తాగితే ఇన్ని ప్రయోజనాలా..?

by Sravanthi
Ad

ప్రస్తుత కాలంలో చాలామంది చైనా ఫుడ్ కు అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. చాలా స్పీడ్ గా ప్రిపేర్ చేసే ఈ ఫుడ్ ఎంత రుచిగా ఉంటుందో అంతా అనారోగ్యకరం.. కాబట్టి అలాంటి ఫుడ్ కి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా రాగిజావ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో మేలు చేసే ఆహారం. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూసేద్దాం..రాగి జావ తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరగడమే కాకుండా మలబద్ధకం, ఫైల్స్ వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి .

Advertisement

అంతేకాకుండా పెద్ద ప్రేవు క్యాన్సర్ వంటివి కూడా రాకుండా ఉంటాయి. రాగిజావ ప్రతిరోజు తీసుకోవడం వల్ల కొవ్వు పెరగడమే కాకుండా , కాల్షియం, పీచు పదార్థం వంటివి అధిక మొత్తంలో ఉండడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇక జీర్ణ ప్రక్రియను క్రమబద్ధీకరించి నిదానంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అలాగే శరీరం పై పేరుకుపోయిన చెడు హార్మోన్లను, కొవ్వును కూడా తగ్గిస్తుంది. స్థూలకాయం ఉన్నవారు ప్రతిరోజు రెండు పూటల రాగిజావని తీసుకుంటే సన్నగా అవుతారు. అంతేకాకుండా షుగర్ వ్యాధిగ్రస్తులు రాగిజావ తీసుకోవడం వల్ల కంట్రోల్ లో ఉంటుందని నిపుణులు అంటున్నారు.

Advertisement

రక్తహీనత ఉన్నవారు కూడా రాగిజావ తీసుకోవాలట. దీనివల్ల రక్తంలో హిమోగ్లిబిన్ శాతం పెరిగి ఆరోగ్యంగా ఉంటారట. ఇవే కాకుండా రాగిజావని పిల్లలకి ఇస్తే అందులో ఉండే క్యాల్షియం, విటమిన్స్ ఎముకల ఎరుగుదలకు ఉపయోగపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. పెద్దవారిలో మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు వంటివి ఇట్టే తగ్గిపోతాయట. అంతేకాకుండా రాగుల్లో ఉండే పోషకాలు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు .

మరికొన్ని ముఖ్య వార్తలు :

Visitors Are Also Reading