Home » రెబల్ స్టార్ కృష్ణం రాజు గారి ముగ్గురు పిల్లలు ఎవరెవరు ఏ ఉద్యోగాలు చేస్తున్నారో తెలుసా ?

రెబల్ స్టార్ కృష్ణం రాజు గారి ముగ్గురు పిల్లలు ఎవరెవరు ఏ ఉద్యోగాలు చేస్తున్నారో తెలుసా ?

by Srilakshmi Bharathi
Ad

తండ్రి రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఓ గొప్ప నటుడు. ఇక అన్న పెదనాన్ననే స్ఫూర్తిగా తీసుకుని టాలీవుడ్ సినిమా స్థాయిని దేశస్థాయి దాటి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన స్టార్ హీరో. అయినప్పటికీ.. వీరి పేర్లు చెప్పుకుని వారు బతికెయ్యలేదు. తమ తండ్రి, అన్నయ్య అంత గొప్ప స్థానాల్లో ఉన్నా.. వారి పేరు చెప్పుకుని బతికేయకుండా.. తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నించారు ఈ ముగ్గురు. వారెవరో కాదు.. కృష్ణం రాజు ముగ్గురు కూతుర్లు.. ఇప్పటికీ వారెవ్వరో బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. వారి పేర్లు ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తి. కృష్ణం రాజు గారు 1940 వ సంవత్సరం జనవరి ఇరవై న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. 1966 లో చిలకాగోరింక సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసారు.

Advertisement

కృష్ణం రాజు తన కెరీర్‌లో 183 కంటే ఎక్కువ చలన చిత్రాలలో నటించారు. కృష్ణంరాజు ఐదు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ మరియు మూడు రాష్ట్ర నంది అవార్డులను గెలుచుకున్నారు. కృష్ణంరాజు జీవన తరంగాలు (1973), కృష్ణవేణి (1974), భక్త కన్నప్ప (1976), అమర దీపం (1977), సతీ సావిత్రి (1978), కటకటాల రుద్రయ్య (1978), మన వూరి పాండవులు (1978) వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. కృష్ణం రాజుగారికి మొదట సీతాదేవి గారితో వివాహం అయింది. వీరి జంట చాలా అన్యోన్యంగా ఉండేది. కానీ, దురదృష్టవశాత్తు ఆవిడ కార్ ఆక్సిడెంట్ లో మరణించారు.

ఆ తరువాత తండ్రి ఒత్తిడితో శ్యామలాదేవితో రెండవ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారే సాయి ప్రసీద, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి. ముగ్గురు ఆడపిల్లలే అయినా.. వీరిని సొంతంగా కాళ్లపై నిలబడిగేలా కాన్ఫిడెంట్ గా తీర్చిదిద్దారు. పెద్ద కుమార్తె ప్రసీద సినిమాలపై గాలి మళ్లడంతో లాస్ ఏంజెల్స్ లో రెండు సంవత్సరాల పాటు మూవీ ప్రొడక్షన్ కి సంబంధించిన కోర్స్ ని పూర్తి చేసారు. ఇండియా వచ్చాక ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాకి సహా నిర్మాతగా మారారు. రెండవ కూతురు ప్రకీర్తి ఆర్కిటెక్ట్ కి సంబంధించిన కోర్స్ పూర్తి చేసారు. ఆమె ప్రభాస్ నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్ K కు ఇంటర్న్షిప్ చెయ్యనున్నారు. మూడవ కుమార్తె ప్రకీర్తి సైకాలజీ చేసారు. ఎందరో మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని ట్రీట్ చేస్తూ.. తన రంగంలో దూసుకెళ్తున్నారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading