Home » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు అస్సలు ఆవేశపడకూడదు

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు అస్సలు ఆవేశపడకూడదు

by Anji

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే తెలిసిపోతుంది.  ఈ వారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu

Weekly Horoscope in Telugu 23.07.2023 నుంచి 29.07.2023 వరకు మేషం :

Mesha

Mesha

నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశించిన లాభాలు ఉంటాయి. వ్యాపారం బలంగా ఉంటుంది. ఉద్యోగంలో విజయం లభిస్తుంది. ఎప్పటి పనులను అప్పుడే విజయవంతంగా పూర్తి చేయాలి. ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దు. ఎవ్వరి మాటలు మనసుకు తీసుకోవద్దు. ఆవేశం అస్సలు పనికిరాదు.

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

ఉద్యోగం బాగుంటుంది. చేస్తున్నటువంటి పనుల్లో త్వరగా విజయం లభిస్తుంది. అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే మీకు భవిష్యత్ ని ఇస్తాయి. ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇతరులపై అస్సలు ఆధారపడకూడదు.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

వ్యాపారంలో రాణిస్తారు. దేని కోసం ప్రయత్నిస్తున్నారో దానిని అందుకుంటారు. భవిష్యత్ కి అవసరమైన ప్రణాళికలను రచించే కాలం. చంచలత్వం లేకుండా మనోబలంతో ముందుకు వెళ్లాలి. ఉద్యోగంలో ప్రశంసలుంటాయి. దగ్గరి వారి సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

ఏకాగ్రతతో పనులను విజయవంతంగా ప్రారంభించాలి. శాంతంగా ఆలోచించడం ద్వారా ఒత్తిడిని అధిగమించాలి. కీలక కార్యక్రమాల్లో శ్రద్ధ వహించాలి. సానుకూలంగా ఆలోచించడం చాలా ఉత్తమం. స్పష్టమైన నిర్ణయాలతో లక్ష్యాన్ని చేరండి. గత అనుభవంతో ఇబ్బందులను అధిగమించాలి.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. బాధ్యతలను సకాలంలో నిర్వర్తిస్తే విజయం లభిస్తుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కాలం చాలా మిశ్రమంగా ఉంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి. చిన్న పొరపాటు జరిగినా నష్టం ఎక్కువగా ఉంటుంది.

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

ఉద్యోగంలో అనుకూల ఫలితాలుంటాయి. అనుకున్న మార్గంలోనే ముందుకు వెళ్లండి. మధ్యలో నిర్ణయాలు అస్సలు మార్చకూడదు. పనులను సగంలోనే ఆపకూడదు. వ్యాపారంలో విశేష లాభాలున్నాయి. మిత్రబలం పెరుగుతుంది.

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

ఉద్యోగంలో ఉన్నతస్థితి గోచరిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తోంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పని ఒకటి పూర్తి అవుతుంది. వాహన యోగం ఉంది. ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరులపై అస్సలు ఆధారపడకూడదు.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ వహించకండి. దేనికీ తొందరపడకూడదు. ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఈర్ష్యతో నిందలు మోపేవారుంటారు. ఆశయం నెరవేరేవరకు మౌనంగా, వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఏ పని అయినా ఇంట్లో వారికి చెప్పి చేయాలి.

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

విజయం వరిస్తుంది. మీ ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు. గృహ నిర్మాణ కార్యాలు సఫలం అవుతాయి. పిల్లలకు మేలు జరుగుతుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలుంటాయి. కీలక నిర్ణయాల్లో జాప్యం అస్సలు పనికిరాదు. నూతన కార్యాలు ప్రారంభించేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. 

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

ఆశించిన స్థాయి లభిస్తుంది. బంగారు భవిష్యత్ ని నిర్మించుకునేందుకు తగిన సమయం ఇది. ఖర్చులను నియంత్రించుకోవాలి. వ్యాపారం మిశ్రమంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండటం చాలా ఉత్తమం. ఒంటరిగా దూరప్రయాణాలు చేయకూడదు. సమిష్టి నిర్ణయాలు శక్తిని ఇస్తాయి.

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. స్థిరమైన ఫలితాలుంటాయి. సత్ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. వ్యతిరేక ఆలోచనలు అస్సలు వద్దు. ఆవేశపరిచే వారు ఉంటారు శాంతంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

ఉద్యోగంలో మంచి ఫలితాలుంటాయి. ధైర్యంగా ముందుకు వెళ్లండి. ఆశించిన ప్రతిఫలం అందుతుంది. నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పని ఒకటి పూర్తి అవుతుంది. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణ సమస్యలు తొలగిపోతాయి. విశ్రాంతి చాలా అవసరం. 

Visitors Are Also Reading