Home » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారి ఆదాయానికి లోటు ఉండదు

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారి ఆదాయానికి లోటు ఉండదు

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 : మేషరాశి వారికి ఈ వారంలో శుభగ్రహాల అనుకూలత కాస్త ఎక్కువగానే ఉంది. సమయం చాలా వరకు కలిసి వస్తుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ ఆలోచనలు సఫలమవుతాయి. ప్రతిభ పాఠవాలు వృద్ధి చెందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఈ వారం వార ఫలాలు ఏవిధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Weekly Horoscope in Telugu

Advertisement

 

Weekly Horoscope in Telugu 05.11.2023 నుంచి 11.11.2023 వరకు మేషం :

Mesha

Mesha

 

శుభ గ్రహాల అనుకూలత కాస్తంత ఎక్కువగానే ఉంది. సమయం చాలావరకు కలిసొస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగానే కాకుండా గౌరవప్రదంగా కూడా ఉంటాయి. ఇష్టమైన వ్యక్తుల నుంచి మంచి కబుర్లు వింటారు. ఆర్థిక పరిస్థితి పర్వాలేదనిపిస్తుంది. 

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ ఆలోచనలు సఫలం అవుతాయి. ప్రతిభా పాఠవాలు వృద్ధి చెందుతాయి. ఎలాంటి ప్రయత్నమైనా ఫలిస్తుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులు బాగా సన్నిహితులవుతారు. దూర ప్రాంతంలో ఉన్న బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నా లకు మంచి స్పందన లభిస్తుంది. 

Weekly Horoscope in Telugu : మిథునం

 

Mithuna

Mithuna

 

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చు చేస్తారు. ముఖ్యమైన పనులు నిదానంగా, ప్రశాంతంగా పూర్తవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. ప్రయాణాల వల్ల డబ్బు నష్టం తప్ప ఫలితం ఉండకపోవచ్చు. 

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

 

 కుటుంబ వ్యవహారాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టడం మంచిది. బంధుమిత్రులతో మంచి కాలక్షేపం చేస్తారు. సతీమణికి కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.  

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

 

ఆర్థిక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగం పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో బాధ్య తల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది.  వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. 

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి జీవితం సానుకూల మలుపు తిరుగుతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలకు లోటు ఉండదు. 

Advertisement

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

 

ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి కానీ, అనవసర ఖర్చుల మీద అదుపు ఉండదు. విలాసాల మీద ఎక్కువగా ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ మాటకు ఎదురుండదు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి జీవితంలో వేగం పెరుగుతుంది. కొందరు సన్నిహితు లతో కలిసి వృత్తి, వ్యాపారాలను విస్తరించాలనే ప్రయత్నం చేస్తారు. 

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

 

ఉద్యోగంలో అధికారులు బరువు బాధ్యతలు పెంచే అవకాశం ఉంది. వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతున్నప్పటికీ ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి ఆశిం చిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసు కుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొద్దిగా ఆలస్యంగానైనా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

ఆర్థిక లావాదేవీలు ఆశించిన విధంగా ప్రయోజనాలను ఇస్తాయి. చిన్ననాటి స్నేహితులతో విందుల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలు సాను కూలంగా పురోగతి చెందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి.

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

 

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండడంతో కొందరు బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. ఇంటా బయటా పలుకుబడి పెరుగు తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. వ్యాపారం నిలకడగా సాగిపోతుంది.

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

ఆదాయానికి, ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలు తప్పకపోవచ్చు. ఉపయోగించుకుని వదిలేసేవారు ఎక్కువవుతారు. ముఖ్యంగా ఉద్యోగంలో అధికారులు ఎక్కువగానే ఉపయోగించుకుంటారు. ప్రస్తుతానికి సమయం అనుకూలంగా లేనం దువల్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. మధ్య మధ్య కుటుంబ సంబంధమైన ఇబ్బందులు, అనారోగ్యాలు తప్పకపోవచ్చు.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

కొందరు బంధుమిత్రుల నుంచి ఆర్థికపరంగా ఇబ్బందులు ఉంటాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉన్నందువల్ల పట్టుదలగా ప్రయత్నాలు కొనసాగించడం మంచిది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపా రంలో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. బంధు వుల నుంచి, పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. 

మరిన్ని తెలుగు వార్తలు ఇక్కడ మనం చూద్దాం.

Visitors Are Also Reading