Home » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారికి అకస్మిక ధనలాభం కలుగుతుంది

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారికి అకస్మిక ధనలాభం కలుగుతుంది

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 : మేషరాశి వారి పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని వివాదాలు సునాయసంగా పరిష్కారం అవుతాయి.  వృషభ వారి కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆస్తి విషయాల్లో ఒప్పందాలు చేసుకుంటారు. ఈ వారం 12 రాశులకి సంబంధించి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu 03.12.2023 నుంచి 09.12.2023 వరకు మేషం :

Mesha

Mesha

పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని వివాదాలు సునాయసంగా పరిష్కారం అవుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు. రాజకీయ వర్గాలకు సన్మానయోగం ఉంటుంది. విద్యార్థులు అనుకున్న విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. 

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆస్తి విషయాల్లో ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలం అవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో మీ సత్తా చాటుకొని గుర్తింపు పొందుతారు. కళాకారులకు ఊహించని అవకాశాలు రావచ్చు. వారం మధ్యలో దూర ప్రయాణాలు, ఇంటా బయటా ఒత్తిడి ఉంది.

Weekly Horoscope in Telugu : మిథునం

 

Mithuna

Mithuna

పనుల్లో ఆలస్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు ఉంటాయి. అకస్మాత్తు ప్రయాణాలుంటాయి. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపారాల్లో కొద్ది పాటి చికాకులు.  ఉద్యోగులకు అకస్మిక మార్పులు ఉంటాయి. రాజకీయ వర్గాలకు నిరుత్సాహమే. నిరుద్యోగుల యత్నాలు కొంతవరకు సఫలమవుతాయి. వారం మధ్యలో పరిచయాలు పెరుగుతాయి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

 

దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. రావాల్సిన సొమ్ము అందుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది.  ఇంట్లో శుభకార్యాలు నిరుద్యోగులకు ఊరట కలిగిస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటున్నాయి. ఉద్యోగాల్లో గందరగోళం తొలగిపోతుంది. కళారంగం వారికి నూతన ఉత్సాహం వారం చివరిలో వ్యయప్రయాసలు ఉంటాయి.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలు తీరుతాయి. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు అందుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలులో చిక్కులు తొలగుతాయి. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. వ్యాపార లావాదేవీలు పుంజుకుని లాభపడతారు. ఉద్యోగాల్లో బాధ్యతలు కొంత పెరుగుతాయి. పారిశ్రామిక వర్గాల యత్నాలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో శుభవార్తలు వింటారు.

Advertisement

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

నూతన వ్యక్తుల పరిచయం అవుతారు. ఇంట్లో శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. భూవివాదాలు పరిష్కారమవుతాయి. బంధువులతో విభేదాలు తొలగిపోతాయి. వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు నూతన ఉత్సాహం కలుగుతుంది. విద్యార్థులకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. 

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

ముఖ్యమైన పనులు సాఫీగా పూర్తి చేస్తారు.  సంఘంలో గౌరవం లభిస్తుంది. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ధన లాభం కలుగుతుంది. ఆస్తి వివాదాలు తీరి లాభం చేకూరుతుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులు తొలగిపోతాయి. ఉద్యోగాల్లో పనిభారం కలుగుతుంది. కొందరికీ ప్రమోషన్లు సైతం లభిస్తాయి.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. సమస్యల నుంచి బయట ఊరట చెందుతారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. నూతన ఇళ్లు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదా లభిస్తుంది. విదేశీ పర్యటనలుంటాయి. వారం ప్రారంభంలో వ్యయ, ప్రయాసలుంటాయి.

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

ఆర్థిక వ్యవహారాల్లో చికాకులు తొలగిపోతాయి. వాహన, కుటుంబ సౌఖ్యం జీవితాశయం నెరవేరుతుంది. సోదరులతో వివాదాలు తలెత్తుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.. రాజకీయ వర్గాలకు పదవులు లభించవచ్చు. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలుంటాయి.

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఓ సమస్య తీరి ఊరట చెందుతారు. ఆరోగ్యపరంగా చికాకులు తొలగిపోతాయి. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు ఉంటాయి. కళారంగం వారికి సన్మానాలు పురస్కారాలు ఉంటాయి. 

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

ఆస్తి వ్యవహారాల్లో చిక్కులు అధిగమించి లబ్ది చేకూరుతుంది. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో మరింత లాభపడుతారు. ఉద్యోగాల్లో వివాదాలు పరిష్కారం అవుతాయి. రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు కలుగుతాయి. వారం చివరిలో బంధువులతో మాటపట్టింపులుంటాయి.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

పాత బాకీలు వసూలు అవుతాయి. వాహనాల కొనుగోలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారే అవకాశముంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగుల లాభం కలుగుతుంది. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు వింటారు. పారిశ్రామిక రంగం వారు ఆశించిన ప్రగతి సాధిస్తారు.

మరిన్ని తెలుగు వార్తలు ఇక్కడ మనం చూద్దాం.

Visitors Are Also Reading