Weekly Rasi Phalau in Telugu 2023 : రాశిఫలాలు చదవడం వల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే తెలిసిపోతుంది. ఈ వారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Weekly Horoscope in Telugu 18.06.2023 నుంచి 24.06.2023 వరకు మేషం :
కుటుంబపరంగా ఈ వారం ప్రశాంతంగా గడిచి పోతుంది. ఆర్థిక పరిస్థితి కాస్త నిలకడగానే కొనసాగుతుంది. ఖర్చు విషయాల్లో ముందు చూపుతో వ్యవహరించడం చాలా ఉత్తమం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి.
Weekly Horoscope in Telugu 2023: వృషభం
ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశముంది. కొంచం పని భారం కూడా పెరగవచ్చు. ఇంట్లో, బయట శ్రమ ఒత్తిడి ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. ఆదాయం నిలకడగానే ఉంటుంది. వైద్య ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. అనుకోకుండా ఆదాయం పెరిగే ఛాన్స్ ఉంది. కొందరూ స్నేహితులతో మాట పట్టింపులు వచ్చే ఛాన్స్ ఉంది.
Weekly Horoscope in Telugu : మిథునం
ఉద్యోగ వాతావరణం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగపరంగా ఆదాయం లేదా సంపాదన పెరిగే అవకాశముంది. కుటుంబ పరంగా ఒకటి రెండు చిన్న చిన్న చికాకులు తెప్పిస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ.. అనుకోకుండా ఖర్చులు పెరగడం వల్ల అవస్థలు పడే అవకాశముంది. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది.
Weekly Horoscope in Telugu : కర్కాటకం
ముఖ్యమైన పనులు వాయిదా వేయడం చాలా మంచిది. ఉద్యోగంలో సహచరుల బాధ్యత కూడా పంచుకోవాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి కాస్త నిలకడగానే కొనసాగుతుంది. కుటుంబ పరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన కొద్దిగా ఒడిదుడుకులకు లోన్ అవుతుంది.
Weekly Horoscope in Telugu : సింహం
ఈ రాశి వారికి ప్రస్తుతం మూడు శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల అటు ఉద్యోగ జీవితం, ఇటు కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతాయని చెప్పవచ్చు. ప్రధానంగా లాయర్లు, డాక్టర్లు లబ్ది పొందుతారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇతరుల నుంచి అందాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతోనే చేతికి అందుతుంది.
Weekly Horoscope in Telugu : కన్య
ఈ రాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. కొన్ని ముఖ్యమైన పనులు వేగంగా పూర్తవుతాయి. మనస్సులోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. రెండు, మూడు మార్గాల్లో డబ్బు కలిసి వస్తుంది. ఇష్టపడి వారితో పెళ్లి నిశ్చయమయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశముంది. కీలకమైన సమస్య పరిష్కారమవుతుంది.
Advertisement
Weekly Horoscope in Telugu : తుల
వృత్తి, వ్యాపారాలు కొంత పుంతలు తొక్కే అవకాశముంది. ఆదాయం పెరిగి అవసరాలు తీరడంతో పాటు ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అధికారుల నుంచి మంచి ఆదరణ, అభినందనలు లభిస్తాయి. మీ దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. బంధు, మిత్రుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది.
Weekly Horoscope in Telugu : వృశ్చికం
ఈ రాశి వారు తరుచూ ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడే అవకాశముంది. ఇక ఈ వారం బంధు, మిత్రులతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కొద్దిగా చూసి చూడనట్టు వ్యవహరించడం మంచిది.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు పాటించడం చాలా ఉత్తమం.
Weekly Horoscope in Telugu : ధనుస్సు
అదనపు ఆదాయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగం పరంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి అవకాశముంది. వ్యాపారులకు లాభాల శాతం పెరగవచ్చు. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ పరంగా శుభవార్తలు వింటారు. కొత్త నిర్ణయాలు ఆశించిన స్థాయిలో మంచి ఫలితాలను ఇస్తాయి. పిల్లల్లో ఒకరు చక్కని పురోగతి సాధిస్తారు.
Weekly Horoscope in Telugu : మకరం
ఈ రాశి వారికి దూరపు బంధువుల నుంచి ఓ శుభవార్త అందుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఉద్యోగ జీవితం చాలా ప్రశాంతంగా సాగిపోతుంది. పిల్లలకు సంబంధించిన ఒకటి రెండు సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
Weekly Horoscope in Telugu : కుంభం
చాలా కాలం నుంచి ఉన్నటువంటి ఆస్తి సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు, చేరపులు చోటు చేసుకునే అవకాశముంది. జీవితంలో పని భారం పెరుగుతుంది. కొద్దిగా డబ్బు నష్టం జరిగే అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి.
Weekly Rasi Phalau in Telugu : మీనం
ఈ రాశి వారికి ప్రస్తుతం అనుకూలంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం. ప్రయత్నాలు కొనసాగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగంలో అధికారులకు ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. సహచరుల నుంచి సహాయం అందుతుంది. స్నేహితుల్లో ఒకరిద్దరికీ ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి.