Home » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. 17-09-2023 నుంచి 23-09-2023

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. 17-09-2023 నుంచి 23-09-2023

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే మనకు తెలిసిపోతుంది.

Weekly Horoscope in Telugu

Advertisement

ఈ వారం లో ఈ కింద ఉన్నటువంటి  12 రాశుల వారికి సంబంధించిన  రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu 17.09.2023 నుంచి 23.09.2023 వరకు మేషం :

Mesha

Mesha

ఉద్యోగంలో మంచి విజయం సాధిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ధైర్యంగా చేసే పనుల్లో విశేష లాభాలుంటాయి. విజ్ఞాన పరంగా పరిశోధనలు చేయడానికి అనుకూలమైన సమయం ఇది. గృహ నిర్మాణ రంగాల్లో పురోగతి సాధిస్తారు. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. వాగ్వాదాలకు అస్సలు వెళ్లకూడదు.

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

వ్యాపారం చాలా బాగుంటుంది. లక్ష్యం చేరువలోనే ఉంది. కష్టపడి పని చేయండి. శాస్త్రీయ  దృక్పథాన్ని అనుసరించాలి. పెట్టుబడులు మంచి లాభాన్ని ఇస్తాయి. స్థిర, చరాస్తులు అభివృద్ధి చెందుతాయి. ఆశయం నెరవేరేవరకు శ్రమించాలి. పనులను వాయిదా వేయకూడదు. వివాదాలకు దూరంగా ఉండటం చాలా ఉత్తమం.

Weekly Horoscope in Telugu : మిథునం

 

Mithuna

Mithuna

 

ఉద్యోగంలో శ్రద్ద చాలా అవసరం. పనులను ఇతరులకు పురమాయించకుండా స్వయంగా చేసుకోవాలి. ఒత్తిడికి గురికాకుడదు. బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా మంచి ఫలితాలను సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శాంతంగా మాట్లాడాలి. మొహమాటం వల్ల శ్రమ పెరుగుతుంది.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

 

నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది. ఉద్యోగంలో ప్రతిభ చూసి అద్భుతైన ఫలితాలను సాధిస్తారు. ఎటు చూసినా విజయమే మిమ్మల్ని గెలిపిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలున్నాయి. మేలు చేసేవారు ఉన్నారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మేలు అయిన భవిష్యత్ సొంతం అవుతుంది. ఆస్తులు వృద్ధి చెందుతాయి. అదృష్టం కలిసొస్తుంది.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

ఉద్యగంలో స్థిరత్వం లభిస్తుంది. ఉన్నత స్థితికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే అగ్రగామిగా నిలబడుతారు. కొన్ని విషయాల్లో మీ యొక్క శక్తి సామర్థ్యాలకు పరీక్ష కాలంగా అనిపిస్తుంది. సొంత నిర్ణయాలు మేలు కలిగిస్తాయి. వృధా వ్యయాన్ని నివారించాలి. ధ్యానానికి సమయం కేటాయించడం చాలా ఉత్తమం.

Advertisement

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

విఘ్నాలు ఎదురయ్యే అవకాశముంది. అప్రమత్తంగా ఉండాలి. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగిస్తే.. అదృష్టం వరిస్తుంది. బంధు, మిత్రుల సహకారాలు ఉంటాయి. ఖర్చులను నియంత్రించండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం చాలా ఉత్తమం.

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

 

వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతున్నాయి. పలు మార్గాలలో అభివృద్ధిని సాధిస్తారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రత్యేక గుర్తింపునకు కృషి చేయండి. పనులను వాయిదా వేయకుండా విజయవంతంగా పూర్తి చేయండి. ధర్మ మార్గంలో ముందుకు సాగండి. కొందరి వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. ఓర్పుతో పని చేసి లక్ష్యాన్ని సాధించండి.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

అద్భుతమైన శుభ యోగాలు ఉన్నాయి. ఎదురుచూస్తున్న విజయం లభిస్తుంది. పదవీ లాభముంది. మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది. వ్యాపారంలో జాగ్రత్త పడితే ధన, ధాన్యాభివృద్ధి కలుగుతుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆర్థికమైన నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన బాధ్యతలు ఉంటాయి. ఇంటా బయటా కార్యసిద్ధి లభిస్తుంది. ప్రణాళికాబద్ధంగా ఆర్థిక స్థితి గతులను మెరుగు పరుచుకుంటారు. బందు, మిత్రుల సహకారం లభిస్తుంది. రుణ సమస్యలు తొలుగుతాయి. భూ గృహ వాహన యోగాలున్నాయి. ఓ శుభవార్త వింటారు.

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

ముఖ్యమైన ఏకాగ్రత చాలా అవసరం. కాలం వ్యతిరేకంగా ఉంది. ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయడం ఉత్తమం. మీ యొక్క బాధ్యతలను మీరు నిర్వర్తించడం ద్వారా ఇబ్బందులను అధిగమించవచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం సం

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

లక్ష్యంపై దృష్టి పెట్టడం చాలా అవసరం. అద్భుతమైన ప్రవర్తన మీకు మేలు చేస్తుంది. ఎవ్వరినీ నమ్మకూడదు. కర్తవ్య దీక్షతో పని చేసి పని చేసి అధికారుల ప్రశంసలు పొందుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే వ్యాపారంలో నష్టాలను నివారించవచ్చు.  మీ యొక్క ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

వ్యాపారం మీకు కలిసొస్తుంది. విశేష ధనలాభం ఉంటుంది. అవరోధాలు తొలగుతాయి. అదృష్టవంతులవుతారు. నూతన విషయాలను తెలుసుకుంటారు. పెట్టుబడులు మీకు లాభాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో మిశ్రమ వాతావరణం కనిపిస్తోంది. ఎవ్వరితో కూడా విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి.

Visitors Are Also Reading