Home » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే తెలిసిపోతుంది.  ఈ వారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu 02.07.2023 నుంచి 08.07.2023 వరకు మేషం :

Mesha

Mesha

ఉద్యోగంలో తగిన గుర్తింపు ప్రశంసలూ లభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికంగా కలిసి వస్తుంది. జీవితాశయం ఒకటి నెరవేరుతుంది. వ్యాపారంలో మొమమాటం, చంచలత్వం పనికిరావు. అనుకున్న మార్గంలోనే ముందుకు వెళ్లండి. పనులను మధ్యలో అస్సలు ఆపకూడదు.

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

వ్యాపారంలో కలిసి వస్తుంది. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. గృహ నిర్మాణంలో మంచి ఫలితాలు ఉంటాయి. సంతానం వల్ల ఆనందం కలుగుతుంది. ఎదురుచూస్తున్న పని ఇప్పుడూ పూర్తి అవుతుంది. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. 

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

సకాలంలో పని చేసి విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో శుభవార్త వింటారు. ఎన్నాళ్ల నుంచి ఎదురుచూస్తున్న పని ఇప్పుడు పూర్తి అవుతుంది. మీ మనస్సు బద్దకించడం వల్ల సమస్యలు పెరుగుతాయి ఆస్తిని వృద్ది చేస్తారు. 

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

భవిష్యత్ కి అవసరమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. సందేహించకుండా పనులను ప్రారంభించండి. ఉద్యోగ, వ్యాపారాల్లో పొరపాట్లు జరగనివ్వకూడదు. ఏకాగ్రతకు భంగం కలిగించే వారు ఉన్నారు. కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయాలను తీసుకోవాలి. కుటుంబ కలహ సూచన ఉంది.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

ఉద్యోగంలో  స్థిరత్వం లభిస్తుంది. చురుకుగా నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం. తోటివారి ప్రోత్సాహం లభిస్తుంది. కొన్ని సమస్యలకు వెంటనే పరిష్కారం లభించే అవకాశముంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి.

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

ఇబ్బందులు తొలగిపొతాయి. ఉద్యోగం చాలా బాగుంటుంది. సకాలంలో పనిని ప్రారంభించడం చాలా ఉత్తమం. ధర్మమార్గంలో విజయాలను సాధిస్తారు. భవిష్యత్ కి అవసరమైన పనులు చేస్తారు. ఆవేశం అస్సలు పనికిరాదు. సంతాన సంబంధించి శుభవార్తలు వింటారు.

Advertisement

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

ఏకాగ్రతతో పని చేసి ఉద్యోగంలో శుభఫలితాలను సాధిస్తారు. ఇతరుల పనుల్లో అస్సలు తలదూర్చకూడదు. మీరు ఎవరికైనా మేలు చేయాలని ప్రయత్నిస్తే మీకు చెడు జరిగే అవకాశముంది. అపార్థాలకు తావు లేకుండా వ్యవహరించాలి. ఒత్తిడి లేకుండా స్పష్టతతో పని చేయండి. శ్రమ అధికమైనా ఫలితం బాగుంటుంది.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

సకాలంలో నిర్ణయాలు తీసుకొని ఆర్థికంగా బలపడుతారు. ఉద్యోగంలో సమస్యలు తగ్గుతాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించండి. గెలుపు ఒటములకు అతీతంగా పని చేయాలి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనులను వాయిదా వేయకూడదు. ముందుకు వెళ్లితే విజయం లభిస్తుంది.

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. సరైన నిర్ణయాలు తీసుకొని బంగారు భవిష్యత్ కి బాటలు వేసుకుంటారు. వ్యాపారంలో స్వల్ప సమస్యలున్నాయి. బుద్ధిబలంతో వాటిని అధిగమించాలి. సమిష్టి నిర్ణయాలతో రుణ సమస్యల నుంచి బయటపడే అవకాశముంది.

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. మీ కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. అనుకున్న మార్గంలోనే లక్ష్యాలను చేరుకోవాలి. మధ్యలో మనస్సు మార్చుకోకూడదు. దేని కోసం ప్రయత్నిస్తున్నారో అది లభిస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. 

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

మనోబలంతో పని చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఏ విషయంలో కూడా అస్సలు తొందరపడకూడదు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. కాలం కాస్త వ్యతిరేకంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో అప్రమత్తత చాలా అవసరం. అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది. గత అనుభవంతో పని చేయండి.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

ఉత్సాహవంతంగా పనిని ప్రారంభించండి. వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలుంటాయి. సకాలంలో కీలక నిర్ణయాలు తీసుకొని వాటిి అమలు చేయండి. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. మీ యొక్క భవిష్యత్ కి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం ఉత్తమం. కొన్ని విషయాల్లో పరీక్షకాలంలాగా అనిపిస్తుంది. 

Visitors Are Also Reading