Home » Weekly Horoscope in Telugu 2024 : వార ఫలాలు.. ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో వారు జాగ్రత్త

Weekly Horoscope in Telugu 2024 : వార ఫలాలు.. ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో వారు జాగ్రత్త

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu: మేష రాశి వారికి శుభ గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందున ఈ వారమంతా ఆశించిన విధంగా గడిచిపోతుంది. వృషభ రాశి వారికి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. మిథున రాశి వారు ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Weekly Horoscope in Telugu 18.02.2023 నుంచి 24.02.2024 వరకు మేషం :

ఉద్యోగపరంగా శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. సానుకూల దృక్పథంతో వ్యవహరించడం అవ సరం. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగ విధులను సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు.

Weekly Horoscope in Telugu 2024: వృషభం 

మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాల వల్ల లాభం ఉంటుంది. మిత్రులతో కలిసి ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు, బకాయిలు చేతికి అందుతాయి. ఆస్తి సంబంధమైన వివాదం నుంచి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా ముందుకు సాగు తాయి. ఇంటా బయటా శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.

Weekly Horoscope in Telugu : మిథునం

ఉద్యోగరీత్యా ప్రయాణ సూచ నలున్నాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది. నిరుద్యోగుల శ్రమ ఫలించి దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడ తాయి. సమాజంలో గౌరవాభిమానాలు పెరుగుతాయి. మాటకు, చేతకు విలువ ఉంటుంది. మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు ప్రయోజనం పొందుతారు.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికీ, సప్తమ స్థానంలో శుభ గ్రహాల సంచారం వల్ల వార మంతా తృప్తికరంగానే గడిచిపోతుంది. ముఖ్యంగా వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో స్నేహితులు అండగా నిలబడతారు. ఉన్నత స్థానాలలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

Weekly Horoscope in Telugu : సింహం

 సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. దాదాపు అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించడం మంచిది. ఉద్యోగ జీవితం చాలావరకు సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకోకుండా డిమాండ్ పెరిగి క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది.

Advertisement

Weekly Horoscope in Telugu కన్య

వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అయితే, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. శరీరానికి విశ్రాంతి ఉండక పోవచ్చు. కోరుకున్న పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. కొద్దిపాటి శ్రమతో అధిక లాభం పొందుతారు. దూర ప్రాంతంలోనే అయినా నిరుద్యో గులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు.

Weekly Horoscope in Teluguతుల

వ్యక్తిగతంగా కొద్దిపాటి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో లక్ష్యాలను పూర్తి చేసే విషయంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగుల నుంచి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. లాభదా యక పరిచయాలు ఏర్పడతాయి.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

వృత్తి, వ్యాపారాల్లో కొన్ని కీలక సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు చాలావరకు చక్కబడతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొందరు బంధుమిత్రులతో వివాదాలు, అపార్థాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి.

Weekly Horoscope in Telugu ధనుస్సు

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. తండ్రి జోక్యంతో స్థిరాస్తి వివాదం కొలిక్కి వస్తుంది. ఎటువంటి వాగ్దానాలూ చేయక పోవడం మంచిది.

Weekly Horoscope in Teluguమకరం

వృత్తి, వ్యాపారాల్లో వ్యూహాలు మార్చు కుంటారు. విదేశాల నుంచి ఉద్యోగ సంబంధమైన కీలక సమాచారం అందుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుంచి సహకారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యంలో పాల్గొంటారు.

Weekly Horoscope in Teluguకుంభం

ఉద్యోగాల్లో శ్రమ పెరిగినప్పటికీ అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. ఇంటా బయటా బరువు బాధ్యతలు పెరిగే అవ కాశం ఉంది. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు.

Weekly Rasi Phalau in Telugu : మీనం

వృత్తి, వ్యాపారాల్లో బాగా సంపాదన పెరుగుతుంది. ఉద్యోగంలో మీ మాటకు తిరుగుండదు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శి స్తారు. ఆదాయపరంగా కొత్త ప్రయత్నాల మీద దృష్టి సారిస్తారు. రాజకీయంగా ప్రాముఖ్యం పెరిగి క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది.

మరిన్ని తెలుగు వార్తల  కోసం ఇక్కడ మనం వీక్షిద్దాం.

Visitors Are Also Reading