Home » Weekly Horoscope in Telugu 2024 : వార ఫలాలు.. ఆ రాశికి చెందిన విద్యార్థులు విజయం సాధిస్తారు

Weekly Horoscope in Telugu 2024 : వార ఫలాలు.. ఆ రాశికి చెందిన విద్యార్థులు విజయం సాధిస్తారు

by Anji

Weekly Rasi Phalau in Telugu మేష రాశి వారికి శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. వృషభ రాశికి చెందిన విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధించడం జరుగుతుంది. మిథున రాశికి చెందిన వారికి శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu 11.02.2023 నుంచి 17.02.2024 వరకు మేషం :

వృత్తి జీవితంలోనూ ప్రభావం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాల శాతం పెరుగుతుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు కలసి వస్తాయి. ఆర్థిక సంబంధమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయటా ఆదరాభిమానాలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

Weekly Horoscope in Telugu 2024: వృషభం 

వృత్తి, వ్యాపారాల్లో వృద్ధి కనిపిస్తుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యం, ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధువులతో మాటలు పడాల్సి వస్తుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. విద్యార్థులు విజయం సాధిస్తారు.

Weekly Horoscope in Telugu : మిథునం

ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, వ్యక్తిగత పనులు కూడా స్నేహితుల సహకారంతో పూర్తవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రభుత్వపరంగా లబ్ధి పొందడం జరుగుతుంది.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

ముఖ్యమైన వ్యవహారాలు, వ్యక్తిగత పనులు కూడా స్నేహితుల సహకారంతో పూర్తవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రభుత్వపరంగా లబ్ధి పొందడం జరుగుతుంది.

Weekly Horoscope in Telugu : సింహం

వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు ఆర్జిస్తారు. నిరుద్యోగులు ఆశిం చిన సంస్థల నుంచి ఆఫర్లు అందుకుంటారు. విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

Weekly Horoscope in Telugu కన్య

ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయాల్సి ఉంటుంది. కొందరు మిత్రులను నమ్మి ఆర్థికంగా నష్టపోయే సూచనలున్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది.

Weekly Horoscope in Teluguతుల

వృత్తి, ఉద్యోగాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందుతాయి. వ్యాపారాలు పెట్టుబడులకు అంచనాలకు మించిన ప్రతిఫలం అందుకుంటారు. నిరుద్యోగు లకు మంచి ఆఫర్లు అంది వస్తాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు లాభిస్తాయి.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

వృత్తి, ఉద్యోగాల్లో ఒక మెట్టు పైకెక్కే అవకాశం ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితికి, ఆరోగ్యా నికి ఢోకా ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలు బాగా ఇబ్బంది పెడతాయి.

Weekly Horoscope in Telugu ధనుస్సు

వృత్తి, వ్యాపా రాల్లో మార్పులు చేసి లబ్ది పొందుతారు. ఉద్యోగపరంగా విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగాల్లో ఉన్నవారు వ్యాపార రంగంలో ప్రవేశించే సూచనలున్నాయి. ఆదాయా నికి, ఆరోగ్యానికి లోటు ఉండదు.

Weekly Horoscope in Teluguమకరం

వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారులకు అండగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. అనుకున్న పనులు అనుకు న్నట్టు పూర్తవుతాయి.

Weekly Horoscope in Teluguకుంభం

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగి, అదనపు బాధ్యతలు మీద పడి విశ్రాంతి కరువవుతుంది. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో పోటీదార్ల నుంచి ఇబ్బం దులు తలెత్తుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపో తుంది.

Weekly Rasi Phalau in Telugu : మీనం

 

వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి చెందడానికి అవ కాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు ఉండవచ్చు. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు, వ్యూహాలు పని చేస్తాయి. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలుంటాయి

మరిన్ని తెలుగు వార్తల  కోసం ఇక్కడ మనం వీక్షిద్దాం.

Visitors Are Also Reading