Telugu News » Blog » వింత ఆఫర్…పెళ్లి క్యాన్సిల్ అయితే పది లక్షలు …!

వింత ఆఫర్…పెళ్లి క్యాన్సిల్ అయితే పది లక్షలు …!

by AJAY
Ads

జీవితంలో పెళ్లి అనేది అతిముఖ్య‌మైన ఘ‌ట్టం. ప్ర‌తిఒక్క‌రూ జీవితంలో పెళ్లి చేసుకోవ‌డం కొత్త జీవితాన్ని ప్రారంభించ‌డం జ‌రుగుతుంది. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ పెళ్లి గురించి ఎన్నో క‌ల‌లు కంటారు. ఎంతో వైభ‌వంగా పెళ్లి జ‌ర‌గాల‌ని కోరుకుంటారు. అయితే కొన్నిసార్లు అనివార్య కార‌ణాల వ‌ల్ల పెళ్లిళ్లు క్యాన్సిల్ అవుతాయి. నిజానికి పెళ్లి క్యాన్సిల్ అవ్వాల‌ని ఎవ‌రూ కోరుకోరు. కానీ ఏది మ‌న‌చేతిలో ఉండ‌దు కాబ‌ట్టి కొన్నిసార్లు అలా జ‌రిగిపోతాయి.

Advertisement

Marriage

Advertisement

Advertisement

అయితే అలా జరిగినా కూడా ఆర్థికంగా నష్టం జరగకుండా ఉండేందుకు పలు బీమా సంస్థలు వెడ్డింగ్ ఇన్స్యూరెన్స్ పేరుతో పాలసీలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. వెడ్డింగ్ ఇన్స్యూరెన్స్ పాలసీ అంటే ఏదైనా కారణం వల్ల పెళ్లి రద్దు అయినా లేదంటే పెల్లింట ఏమైనా ప్రమాదం జరిగి ఆస్తినష్టం జరిగినా ఈ పాలసీ వర్తిస్తుంది. అదే విధంగా పెళ్లికి బయలుదేరిన వధువు లేదా వరుడుకు అనుకోని ప్రమాదం జరిగినా ఈ పాలసీ వర్తిస్తుంది. ఇక ఈ పాలసీ ద్వారా డబ్బులు రావాలంటే ముందుగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రూ. 10 లక్షల పాలసీ రావాలంటే రూ. 7,500 నుండి రూ.15 వేల వరకు చెల్లించాలి.

You may also like