Home » Kantharao : మేము ముగ్గురం అన్నదమ్ములం.. రామారావు అలా చెప్పడం మరిచిపోలేను

Kantharao : మేము ముగ్గురం అన్నదమ్ములం.. రామారావు అలా చెప్పడం మరిచిపోలేను

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా పాత తరం హీరోల్లో నటరత్న నందమూరి తారక రామారావుని క్రమ శిక్షణకు, మంచితనానికి మారుపేరుగా చెబుతారు. ముఖ్యంగా దర్శక, నిర్మాతల పట్ల తోటీ నటీనటుల పట్ల ఆయన కనబరిచే ప్రేమానురాగాలు గొప్పగా ఉంటాయని.. ఈ విషయాన్ని గతంలో చాలా మంది ప్రస్తావించారు.  కథానాయకుడు కాంతారావు విషయంలో కూడా జరిగింది. కాంతారావు చివరి రోజుల్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ntr-kantharao

Advertisement

 

భారతీయ సంస్కృతికి అద్దం పట్టే గొప్ప పౌరాణిక చిత్రం ‘లవకుశ’.  ఈ సినిమాలో ఎన్టీఆర్ శ్రీరాముడిగా, అంజలీ దేవి  సీతగా, నేను లక్ష్మణుడిగా నటించాము.  షూటింగ్ ప్రారంభానికి ముందే  నాకు ఇస్నోఫీలియా వచ్చింది. దీంతో  నా పర్సనాలిటీ బాగా వీక్‌ అయిపోయింది. షూటింగ్‌ ప్రారంభమైంది. అప్పుడు షాట్‌లో నటిస్తున్న వారందరికీ వారి క్యారెక్టర్ల పేరుతో డైలాగ్‌ పేపర్స్‌ ఇచ్చారు. నాకు మాత్రం కాంతారావు అని పేరు రాసి డైలాగ్‌ పేపర్‌ ఇచ్చారు. అలా ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. నేను చెప్పాల్సిన డైలాగ్‌ చెప్పి షాట్‌ పూర్తి చేశాను. ఆ తర్వాత అసిస్టెంట్‌ డైరెక్టర్‌ని ఈ విషయం గురించి అడిగాను. తొలుత అనుకున్న లక్ష్మణుడి పాత్ర నుంచి మిమ్మల్ని తప్పించి.. మీకు శత్రుఘ్నుడి పాత్ర ఇవ్వబోతున్నారు. మీ పర్సనాలిటీ తగ్గిందని వారు భావిస్తున్నారని చెప్పారు.

Advertisement

అదేరోజు సాయంత్రం రామారావు గారి వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని చెప్పాను. వెంటనే తన తమ్ముడిని పిలిచి శంకర్ రెడ్డి గారికి ఫోన్ చేసి నా మాటగా చెప్పండి. ఏ వేషానికి బుక్ చేసుకున్నారో ఆ వేషమే ఇవ్వమనండి. అలా వీలు కాకపోతే వారికి ఇచ్చిన అడ్వాన్స్ ను ఇతర సినిమాల్లోకి మార్చుకోమని చెప్పండి. అంతేకానీ ఆర్టీస్ట్ ని అవమాన పరచొద్దు అని ఆయన చాలా పెద్ద మాట అన్నారు. మేము ఇద్దరు అన్నదమ్ములం కాము. ముగ్గురు అన్నదమ్ములం అని ఆయనకి చెప్పండి అన్నారు. అది నా జీవితంలో మరపురాని సంఘటన అని చెప్పారు కాంతారావు. ఆ సంఘటన నా జీవితంలో మరపు రాని సంఘటన.. ఇద్దరం కాదు, ముగ్గురం అన్నదమ్ములం అని చెప్పడంలోని ఆయన గొప్పతనం నన్ను కదిలించి వేసింది అని చెప్పుకొచ్చారు కాంతారావు.

 

Visitors Are Also Reading