వేసవిలో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సీజన్ లో ప్రజలు తరచుగా నీరసంగా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో శక్తివంతంగా ఉండటానికి హైడ్రేటెడ్ ఉండాలని డాక్టర్లు తరచూ చెబుతున్నారు. ఈ సీజన్ లో చెమట కూడా ఎక్కువగా వస్తుంది. దీంతో నీరంతా బయటకు వస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు తగినంత మొత్తంలో నీటిని తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు నీరు అధికంగా ఉండే ఆహారాన్ని కూడా తీసుకోవచ్చు.
Advertisement
ఈ సీజన్ లో పుచ్చకాయ తినండి. అయితే, వీళ్ళు మాత్రం అసలు పుచ్చకాయని తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పుచ్చకాయ తినే ముందు తప్పక డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. పుచ్చకాయలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ b6, మెగ్నీషియం, షుగర్, డైటరీ ఫైబర్, సోడియం, పొటాషియం ఇలా. ఇందులో గ్లైసేమిక్ ఇండెక్స్ 72 ఉంటుంది. ఇందులో సుక్రోస్ ఎక్కువ ఉంటాయి. పుచ్చకాయ తీసుకుంటే షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి.
Advertisement
అందుకని కొంతమంది అసలు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. డయాబెటిస్ ఉన్నవాళ్లు పుచ్చకాయని ఎక్కువగా తినకూడదు. ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. దీంతో సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. కిడ్నీ సమస్య ఉన్నవాళ్లు కూడా పుచ్చకాయని తీసుకోకూడదు. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు దీనికి దూరంగా ఉండటమే మంచిది. అదే విధంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా పుచ్చకాయను తీసుకోకూడదు. ఇందులో పొటాషియం హార్ట్ బీట్ పై ప్రభావం చూపిస్తుంది.