Samantha – Naga Chaitanya: తెలుగు సినీ పరిశ్రమలో నటీనటులుగా మంచి పేరు సంపాదించుకున్న నాగచైతన్య-సమంత జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఏమాయే చేశావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ జంట ఆ సినిమా సమయంలోనే ఫ్రెండ్స్ గా మారారు. వీరి స్నేహం కొద్ది రోజులకు ప్రేమగా మారింది. దాదాపు కొన్నేండ్లు చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ జంట.. పెద్దల సమక్షంలో పెళ్లితో ఒక్కటయ్యారు. పెళ్లి చేసుకున్నటువంటి ఈ దంపతులు ఎందరికో ఆదర్శంగా నిలిచారు. మూడేళ్ల పాటు తమ జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న నాగచైతన్య సమంత చివరికీ తమ వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు.
Advertisement
విడాకులు తీసుకొని విడిపోయినటువంటి ఈ జంట గురించి ఎన్నో రకాల వార్తలు వినిపించినప్పటికీ వీరి విడాకులకు మాత్రం సరైన కారణం ఇప్పటి వరకు తెలియలేదు. వీరు తమ విడాకుల విషయాన్ని మరిచిపోయి వీరిద్దరూ వారి సినీ కెరీర్ లో బిజీగా ఉన్నారు. ఎవరి సినిమాల పనులతో వారు బిజీగా ఉన్న తరుణంలోనే ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు ఈ జంట గురించి చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తరచూ సెలబ్రిటీల గురించి ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తారు ఉమైర్ సందు. తాజాగా సమంత నాగచైతన్య విడాకుల గురించి చేసినటువంటి ట్వీట్ తీవ్ర దుమారం రేపుతుంది.
Advertisement
Also Read : పవిత్ర లోకేష్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో మీకు తెలుసా..?
BREAKING NEWS : As per #SamanthaRuthPrabhu, #NagaChaitanya abused her badly. He was the Worst Husband ever. I suffered alot mentally & physically torture. I was even Pregnant but i did abortion. Thank god, I divorced & moved on. pic.twitter.com/7ybQYB93PZ
— Umair Sandhu (@UmairSandu) March 12, 2023
ఉమైర్ సందు ట్వీట్ చేస్తూ.. నాగచైతన్య పెట్టే టార్చర్ భరించలేకనే సమంత విడాకులు తీసుకుందని తెలిపారు. అతను ఒక బ్యాడ్ హస్పెండ్ అని, తనని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో టార్చర్ చేశారని, చివరికీ తన ప్రెగ్నీన్సీ కూడా అబార్షన్ అయిందంటూ సమంత చెప్పిన విధంగా ఉమైర్ సందు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సమంత నాగచైతన్య దంపతుల గురించి ఈయన చేసిన ట్వీట్ లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. కానీ ప్రస్తుతం వీరి విషయం మరోసారి తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. సమంత ప్రస్తుతం ఖుషి, సిటాడెల్ సిరీస్ లలో బిజీగా ఉండగా.. నాగచైతన్య కస్టడి సినిమా షూటింగ్ పనులను ముగించుకొని తన తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు.
Also Read : 91 ఏళ్ల కీరవాణి తండ్రి యంగ్ గా కనిపించడం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే.!!