Ad
ఐపీఎల్ లో సన్ రైజర్స్ కు ఉన్న అభిమానులో సగం మందికి పైగా డేవిడ్ వార్నర్ కు వ్యక్తిగత అభిమానులే. 2016 లో జట్టును ఛాంపియన్స్ గా నిలిపిన వార్నర్ ను గత ఏడాది సన్ రైజర్స్ యాజమాన్యం ఘోరంగా అవమానించింది. మొదట కెప్టెన్ గా పీకేసి.. తర్వాత జట్టులో నుండి కూడా తీసేసింది. జట్టు ఎపిక్ విషయంలో వార్నర్ కు యాజమాన్యానికి వచ్చిన గొడవే దీనికి కారణం అని తెలుస్తుంది.
దాంతో అందరూ ఊహించిన విధంగానే ఐపీఎల్ 2022 మెగావేలానికి వార్నర్ ను వదిలేసింది హైదరాబాద్. ఇక ఢిల్లీ జట్టు డేవిడ్ భాయ్ ను కొనుగోలు చేయగా.. ప్రస్తుతాం ఆ జట్టు ఓపెనర్ గా వార్నర్ అదరగొడుతున్నాడు. మొదట మూడు మ్యాచ్ లు ఆడకపోయినా.. ఇప్పటికే మూడు అర్ధస్తకాలు బాదాడు. ఇప్పుడు ఈ రెండు జట్లు రేపు ఎదురుపడబోతున్నాయి. దాంతో సన్ రైజర్స్ కు వ్యతిరేకంగా ఆడటం గురించి వార్నర్ కీలక వ్యాఖ్యలు చేసాడు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో వార్నర్ మాట్లాడుతూ… ఇప్పటివరకు మిగితా మ్యాచ్ లతో ఎలా ఆడనో సన్ రైజర్స్ తో కూడా అలానే ఆడుతా..! మ్యాచ్ ను స్పోర్టివ్‌నెస్‌తో తీసుకుంటా. అయితే గత మ్యాచ్ లో నేను షా ఘోరంగా ఔట్ అయాం. అందుకే బాగా ప్రాక్టీస్ చేసి జట్టుకు మంచి ఓపెనింగ్ ఇవ్వాలి అనుకుంటున్నట్లు వార్నర్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి :
Advertisement