Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » వైడ్స్ కూడా డీఆర్ఎస్ పెట్టాలి…!

వైడ్స్ కూడా డీఆర్ఎస్ పెట్టాలి…!

by Azhar
Ads

ఐపీఎల్ 2022 లో అంపైర్లు చాలా తప్పిదాలు చేస్తున్నారు. అవి కూడా చిన్న చితక తప్పులు కాదు.. ఏకంగా మ్యాచ్ ఫలితాన్ని మార్చేసే తప్పులు చేస్తున్నారు. మన హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక్కడే మూడు సార్లు ఈ అంపైర్ తప్పులకు బలయ్యాడు. ఇక నిన్నటి మ్యాచ్ లో కూడా మళ్ళీ అదే రిపీట్ అయ్యింది.

Advertisement

Ad

ఐపీఎల్ లో నిన్న రాజస్థాన్ – కోల్ కతా జట్లకు మధ్య జరిగిన మ్యాచ్ లో ఔట్ ఐన ఒక్క బాల్ ను అంపైర్ వైడ్ గా ప్రకటించాడు. దాంతో రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ రివ్యూ కోరగా ఔట్ అని తేలింది. దాంతో ఆ అంపైర్ నిర్ణయం పై పెద్ద చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇక నుండి వైడ్స్ కూడా డీఆర్ఎస్ అమలు చేయాలనీ ఓ వాదన తెరపైకి వచ్చింది.

ఈ మ్యాచ్ లో జరిగిన ఘటన పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కేప్టెన్ డేనియల్ వెటోరి మాట్లాడుతూ.. ప్రస్తుతం మనం డీఆర్ఎస్ అనేది కేవలం ఔట్ అనేది నిర్ధారించడానికి వాడుతున్నం. కానీ ఈ అంపైర్ల తప్పులు చూస్తుంటే.. ఇంకా మీదట వైడ్స్ కూడా డీఆర్ఎస్ ను ఉపయోగించాలి. ఈ విధంగా ఐసీసీ ఓ కొత్త నియమం తీసుకురావాలి అని తెలిపారు. ఈ వాదనకు ఇమ్రాన్ తాహిర్ కూడా తన మద్దాతు తెలిపాడు.

ఇవి కూడా చదవండి :

సచిన్ వల్ల నేను చాలాసార్లు ఔట్ అయ్యా..?

Advertisement

వుమెన్స్ టీ20 ఛాలెంజ్ డేట్స్ ప్రకటించిన బీసీసీఐ..!

Visitors Are Also Reading