Home » కెప్టెన్ గా రాహుల్ కంటే పంత్ బెటర్..!

కెప్టెన్ గా రాహుల్ కంటే పంత్ బెటర్..!

by Azhar
Ad
ప్రస్తుతం టీ ఇండియా భవిష్యత్ కెప్టెన్ ఎవరు అనే విషయం పైనే బాగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే.. ఇప్పుడు భారత జట్టును మూడు ఫార్మాట్లలో నడిపిస్తున్న రోహిత్ శర్మ ఎన్నో రోజులు ఇంకా బాధ్యతలు నిర్వర్తించలేడు. అందుకే భారత భవిష్యత్ కెప్టెన్ ఎవరు అనే విషయంలో కొన్ని పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అందులో రిషబ్ ప్యాంటు పేరు కూడా ఒక్కటి.
అయితే తాజాగా ఇదే విషయం పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ మాట్లాడుతూ… భారత జట్టుకు కెప్టెన్ గా కేఎల్ రాహుల్ కంటే రిషబ్ పంత్ మంచి ఎంపిక అని అన్నారు. ఎందుకంటే రాహుల్ కన్న పంత్ ఆలోచన విధానం బాగుంది. భారత జట్ల మాజీ కెప్టెన్ లలో అజారుద్దీన్, గంగూలీ, ధోనీ వంటి వారు ప్రతి విషయంలో భిన్నంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వారు. ఇప్పుడు పంత్ కూడా అదే దారిలో ఉన్నాడు.
అందుకే పంత్ ఇలానే తన కెప్టెన్సీ కొనసాగిస్తే భవిష్యత్ లో మంచి కెప్టెన్ గా ఎదుగుతాడు. అయితే హార్దిక్ పాండ్య కెప్టెన్సీ కూడా బాగానే ఉంది. కానీ అతనికి ఫిట్నెస్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల అతడిని కెప్టెన్ చేస్తే చాలా సమస్యలు వస్తాయి అని రషీద్ లతీఫ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading