Home » కోహ్లీకి వార్నర్ అద్భుతమైన సలహా…!

కోహ్లీకి వార్నర్ అద్భుతమైన సలహా…!

by Azhar
Ad

డేవిడ్ వార్నర్ అంటే హైదరాబాద్ అభిమానులకు చాలా ఇష్టం. ఎందుకంటే గత ఏడాది వరకు ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడిన వార్నర్ క్రీజులోనే కాకుండా సోషల్ మీడియా వేదికగా కుడా తెలుగు అభిమానులను అలరించేవాడు. ఎక్కువగా తెలుగు డైలాగ్స్, పాటలతో టిక్ టాక్ వైదొలను కూడా చేసి ఫ్యాన్స్ కు దగ్గరయ్యాడు వార్నర్.

Advertisement

అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడుతున్న వార్నర్.. తాజాగా కోహ్లీకి ఓ అద్భుతమైన సలహా ఇచ్చాడు. ప్రస్తుతం కోహ్లీ ఫామ్ లో లేక పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. దాంతో వార్నర్ తాజాగా పాల్గొన ఓ ఇంటర్వ్యూ లో ”కోహ్లీ ఫేమ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు.. అతనికి మీ ఏం శాల ఇవ్వాలి అనుకుంటున్నారు” అని ప్రశ్నించారు.

Advertisement

దానికి వార్నర్.. ఈ ఫామ్ టెన్షన్ ను వదిలేసి మరి ఇద్దరు పిల్లల్ని కానీ వారితో ఎంజాయ్ చేయమని నవ్వుతు చెప్పాడు. అలాగే ఫామ్ అనేది శాశ్వతం కాదు.. క్లాస్ మాత్రమే శాశ్వతం. ఇలాంటి పరిస్థితు ప్రపంచంలో ప్రతి ఆటగాడికి వస్తుంది. ఈ ఎత్తు పల్లాలు అనేవి ప్రతి ఆటగాడి కెరియర్ లో సహజం. కోగలి కూడా అంతే. అతను తన బేసిక్స్ ను మంచిగా ఫాలో అయితే చాలు అని వార్నర్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

సన్ రైజర్స్ కు వ్యతిరేకంగా ఆడటం పై వార్నర్ కీలక వ్యాఖ్యలు…!

భారత జట్టు వైఫల్యాలకు కారణం అదే..!

Visitors Are Also Reading